రాష్ట్రీయం

హీరో నాగార్జున ఇల్లు ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రియాలిటీ షో బిగ్‌బాస్-3 నిరసనల సెగ హీరో అక్కినేని నాగార్జునకు కూడా తగిలింది. తెలుగు బిగ్ బాస్-3 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున ఇంటిని శనివారం ఉస్మానియా జేఏసీ ముట్టడించింది. బిగ్ బాస్-3 షోను నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు హోస్ట్‌గా తప్పుకోవాలని నాగర్జునకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల నిరసన కారణంగా నాగార్జున ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ జేఏసీ విద్యార్థులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌కు తరలించారు. బిగ్ బాస్ నిర్వాహకులు కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్నారని యాంకర్ శే్వతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తెంలగాణ మానవహక్కుల కమిషన్‌కు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది. షోను అడ్డంపెట్టుకుని మహిళలను లైంగికంగా దోచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో జేఏసీ ఆరోపించింది. కాగా ఆదివారం నుంచి బిగ్ బాస్-3 రియాల్టీ షో ప్రసారం కావల్సి ఉంది. వివాదాల నేపథ్యంలో బిగ్ బాస్-3 షో ప్రసారం అవుతుందో లేదో వేచి చూడాలి.