రాష్ట్రీయం

పత్రికా రంగానికి దిక్సూచి గోరాశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ప్రఖ్యాత సంపాదకుడు గోరాశాస్ర్తి పత్రికారంగానికి దిక్సూచి వంటివారని శనివారం నాడు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన శతజయంతి కార్యక్రమంలో వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని సాహిత్య అకాడమి, వయోధిక పాత్రికేయుల సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా, సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ కే శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనేక మంది గోరాశాస్ర్తి ఘనకీర్తిని , ఆయన రచనలను, సంపాదకీయాలను, సామర్ధ్యాలను కొనియాడారు. వివిధ సందర్భాల్లో గోరాశాస్ర్తి రాసిన సంపాదకీయాల్లోని కీలక అంశాలను చదివి వినిపించారు. గోరాశాస్ర్తి చతురతను, భాషాప్రావీణ్యాన్ని, విషయ పరిజ్ఞానాన్ని వారు గుర్తుచేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు గోరాశాస్ర్తి రచనలపై ప్రత్యేక పత్రాలను సమర్పించారు. సాహిత్య అకాడమి ముద్రించిన వినాయకుడి వీణ గ్రంథావిష్కరణతో పాటు గోరాశాస్ర్తి పై పునర్ముద్రించిన మోనోగ్రాఫ్‌ను కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఉప రాష్టప్రతిని విశిష్ట అతిథులను సత్కరించారు. ప్రారంభ కార్యక్రమానికి వరదాచారి అధ్యక్షత వహించగా, తదుపరి కార్యక్రమానికి సాహిత్య అకాడమి తెలుగు సలహా మండలి సంచాలకుడు కే శివారెడ్డి అధ్యక్షత వహించారు. వినాయకుడి వీణ గ్రంథాన్ని వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షుడు టీ ఉడయవర్లు పరిచయం చేశారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సమావేశానికి బండారు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అందులో గోరాశాస్ర్తి ఆంగ్ల సంపాదకీయాలపై దాసు కేశవరావు, తెలుగు సంపాదకీయాలపై కల్లూరి భాస్కరం, గోరాశాస్ర్తి కథలపై కేబీ లక్ష్మీ, గోరాశాస్ర్తి నాటకాలపై నాగసూరి వేణుగోపాల్ పత్రాలు సమర్పించారు. ‘నాకు తెలిసిన గోరాశాస్ర్తి ’ అంశంపై నందిరాజు రాధాకృష్ణ పత్రాన్ని సమర్పించారు. రెండో సమావేశంలో గోరాశాస్ర్తి శ్రావ్య నాటకాలపై పీఎస్ గోపాలకృష్ణ, గోరాశాస్ర్తి సాహితీ వ్యక్తిత్వంపై గోవిందరాజు చక్రధర్, స్వతంత్ర సంపాదకుడు గోరాశాస్ర్తి జ్ఞాపకాలు అంశంపై కే రామలక్ష్మీ, గోరాశాస్ర్తియం ఒక పరిశీలన అంశంపై శ్రీనివాస్ వాసుదేవ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోరాశాస్ర్తీ కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు.
అంతకుముందు సాహిత్య అకాడమి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సాహిత్య అకాడమి తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, పుస్తకాలు ప్రచురిస్తూ, నిరంతరం సాహిత్యసేవలో నిమగ్నమవుతున్నామని పేర్కొన్నారు. భాషా సాహిత్య రంగంలోనూ, పత్రికా రచనలోనూ, ఇతర ప్రక్రియల్లోనూ విశేషంగా పాటుపడిన వ్యక్తులను గౌరవించుకోవడంలో సాహిత్య అకాడమి తన వంతు పాత్ర పోషిస్తోందని అన్నారు. అందులో భాగంగానే గోరాశాస్ర్తి శతజయంతిని నిర్వహించడంతో పాటు మోనోగ్రాఫ్‌ను ముద్రించామన్నారు. అనేక మంది హేమాహేమీల శతజయంతి సదస్సులను అకాడమి నిర్వహించిందని, శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సందర్భంగా అకాడమి జాతీయ సదస్సును నిర్వహించిందన్నారు. అకాడమి దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. 634 కార్యక్రమాలను నిర్వహించిందని, 476 పుస్తకాలను ముద్రించిందని, 191 పుస్తక ప్రదర్శనలు చేపట్టామని, దాదాపు ఆరున్నర కోట్ల రూపాయిల విలువైన పుస్తకాలను విక్రయించామని చెప్పారు. ఖాసా సుబ్బారావు ఆహ్వానంపై తెలుగు, ఆంగ్ల స్వతంత్ర పత్రికల్లో పనిచేసి సరైన గమ్యానికి చేరుకున్నారని, శక్తి సామర్థ్యాలను సంపాదించుకోవడానికి గొప్ప అవకాశం దక్కిందని అన్నారు. మంచిపత్రికా సంపాదకుడిగా పేరుగడించారని చెప్పారు.
చిత్రం... గోరాశాస్ర్తి జీవితంపై కేంద్ర సాహిత్య అకాడమీ పునర్ముద్రించిన మోనోగ్రాఫ్‌ను ఆవిష్కరిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు. చిత్రంలో పాత్రికేయులు ఉడయవర్లు, జీ.ఎస్.వరదాచారి, సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు, కవి శివారెడ్డి, లక్ష్మణరావు, గోరాశాస్ర్తి కుటుంబ సభ్యురాలు సునంద