రాష్ట్రీయం

నూతన విద్యా విధానానికి కేంద్రం కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కాచిగూడ, జూలై 20: దేశంలో మరుతున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావాడానికి విశేషంగా కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి అన్నారు. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 79వ వార్షికోత్సవ వేడుకలు శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం రాకముందు హైదరాబాద్‌ను నిజాం పరిపాలన ఉందని, విద్యా వ్యవస్థ పూర్తిగా నిజాం నిర్భందంలో ఉండేదని వివరించారు. మేధావులు, సంఘ సంస్కర్తలు, జాతీయవాదులు తెలుగు విద్యా వ్యవస్థను ప్రొత్సహించాలని ఉద్దేశంతో నిజాంకు వ్యతిరేకంగా అనేక విద్యా వ్యవస్థలను ప్రారంభించారని పేర్కొన్నారు. నేడు కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో 8వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. అనేక రంగాల్లో మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. విదేశాలలో చదువుకునే వారు భారతీయులు ఎక్కువగా ఉన్నారని, కొద్ది రోజుల్లో విదేశీయులు భారతదేశం వచ్చి చదువుకునే నిర్మాణం తర్వలో జరుగబోతుందని జోస్యం చెప్పారు. నూతన విద్య విధానం అమలుకు దేశంలో ఉన్న 900 వందల విశ్వవిద్యాలయాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలపారు. దేశం అన్ని రంగాల్లో రాణిస్తుందని, వచ్చే ఐదు సంత్సరాల్లో అనేక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచాన్ని శాసించే దిశకు చేరుకుంటుందని వివరించారు. నూతన విద్య విధానంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ కేశవ్ మెమోరియల్ సొసైటీ 79 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో కష్టపడి చదువుకోవాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అకాక్షించారు. విద్యలో ప్రతిభ కనబరించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బంగారు, వెండి పతకాలను బహురించారు. కార్యక్రమంలో కేశవ్ మెమోరియల్ సొసైటీ ఉపాధ్యక్షుడు నరసింహ్మా రావు, ప్రధాన కార్యదర్శి శ్రీ్ధర్ రెడ్డి, కోశాధికారి ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు.
చిత్రం... కేశవ మెమోరియల్ వ్యవస్థాపక దినోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి