రాష్ట్రీయం

నైపుణ్యతల నవీకరణకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : దేశ రక్షణకు సాయుధ దళాలు, దాని అనుబంధ సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరువయ్యేందుకు గత కొన్ని సంవత్సరాలుగా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగం అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమైనవని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం నాడు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఎంఈఎస్ ప్రొబేషనరీ అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ రక్షణకు అవసరమైన వౌలిక వసతుల కల్పనలో ఎంఈఎస్ కీలక పాత్రను పోషిస్తూ వస్తోందని అన్నారు.
దేశ రక్షణలో తమ సహ భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా సేవలందించేందుకు మిలటరీ ఇంజనీర్లు తమ వృత్తి నైపుణ్యాలను నవీకరించుకుంటూ ముందుకు సాగాలని ఉప రాష్టప్రతి సూచించారు. మిలటరీకి కావల్సిన ఎయిర్ ఫీల్డులు, స్పోర్ట్సు కాంప్లెక్స్‌లు, హాంగర్లు, డాక్ యార్డులు, మెరైన్ నిర్మాణాలు మొదలైన అధునాతన , సంక్లిష్ట ప్రాజెక్టులను ఎంఈఎస్ చేపడుతూ దేశ రక్షణకు తనవంతు సాయం అందిస్తోందని అన్నారు. దీనికి తోడు ఎంఈఎస్ పర్యావరణ హితంగా విద్యుత్ ఆదా కార్యక్రమాలు, పునరుత్పాదక ఇంధన వినియోగం, గ్రీన్ టెక్నాలజీ వాడకంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులను నిర్వహిస్తుండటాన్ని ఆయన గుర్తుచేశారు.
రక్షణ శాఖ కాలేజీ ఆఫ్ మిలటరీ ఇంజనీరింగ్ తరఫున ప్రొబేషనరీ అధికారులకు తొలిసారి డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ప్రాధమిక శిక్షణ నిర్వహించారు. ఇందులో దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు ప్రొబేషనర్లు శిక్షణ పొందారు. భారత రక్షణ వౌలిక రంగం అన్ని విధాలుగా భారీ స్థాయిలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని ఉపరాష్టప్రతి పేర్కొన్నారు. శిక్షణ అనేది ఒకేసారి అయిపోయే వ్యవహారం కాదని, నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని చెప్పారు. అత్యత్తమ ఫలితాలను అందించేందుకు ఎంఈఎస్ ప్రొబేషనర్లు దేశ వ్యాప్తంగానూ, ప్రవాసంలోనూ, ప్రైవేటులోనూ, ప్రభుత్వ రంగంలో అందుబాటులో ఉన్న అన్ని మెరుగైన విధానాల అందుకునేందుకు గానూ వ్యవస్థలో ఉన్న విధానాలలో సంస్కరణలకు కృషి చేయాలని అన్నారు. శిక్షణలో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచిన రజత్ కొఠారీకి , అత్యుత్తమ మార్కులు సాధించిన సాగర్ మహేశ్వరి, క్రీడల్లో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచిన పుణిత్ దిమాన్లకు డైరెక్టర్ జనరల్ షీల్డులను ఉప రాష్ట్రపతి అందించారు. కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ డీజీ బీపీ ఆచార్య మాట్లాడుతూ విలువలూ, నైపుణ్యాలు, విజ్ఞానంతో కూడిన శిక్షణ అందించినట్టు చెప్పారు.
చిత్రం... ఎంఈఎస్ ప్రొబేషనరీ అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు