రాష్ట్రీయం

అప్పటికప్పుడే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: చట్టసభల చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తనదైన శైలిలో సరికొత్త సంప్రదాయాలు నెలకొల్పుతున్నారు. ఇప్పటివరకు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కేవలం ప్రచారానికే మినహా ఒరిగేదేమీ ఉండటం లేదన్న భావన ఏకంగా శాసనసభ్యుల్లోనే ఉంది. ఈ సమయాల్లో అటు సభా నాయకుడు, ఇటు ప్రతిపక్ష నేత కూడా సాధారణంగా సభలో కన్పించేవారు కాదు. దీంతో ప్రశ్నోత్తరాల్లో మంత్రులు అధికారులు రాసిచ్చే సమాధానాలు చదివి ‘మమ’ అనిపించుకుంటే, ఇక జీరో అవర్‌లో అయితే అత్యధిక మంది మంత్రులే కన్పించేవారు కాదు. దాంతో సభలో ఉండే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్లో ఒకరు లేచి సభ్యుల గోడు విని రాసుకోకపోయినా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళతామంటూ ముక్తిసరిగా బదులిచ్చేవారు. ఈదఫా తొలిసారిగా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సరిగ్గా ఉదయం 9గంటలకే సభలో కనిపిస్తున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల్లో విస్తృత చర్చకు అవకాశమిస్తూ, అవసరమైతే మధ్యాహ్నం 3గంటల వరకు సభను కొనసాగిస్తున్నారు. జీరో అవర్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సభ ముగిసేలోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆయన రూలింగ్ ఇచ్చారు. సీఎం జగన్ అయితే ప్రశ్న అడిగిన తన పార్టీ సభ్యులను సభలోనే తనవద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఆ సమస్య సత్వర పరిష్కారం కోసం అక్కడున్న సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సభ్యుడిని మాట్లాడిస్తున్నారు. తాజాగా 20వేల జనాభా కలిగిన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో నెలకొన్న మంచినీటి సమస్యను శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు సభలో ప్రస్తావించారు. పట్టణంలో మంచినీరు దొరకదని, 24 కి.మీల దూరంలోని బొల్లాపల్లి మండలం మూగబంతిపల్లెలోని సాగర్ పాయ నుంచి ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే తమకు దిక్కని తెలిపారు. అంటే ఒక్క ట్యాంకర్ రానుపోను 50 కి.మీలు తిరగాల్సి ఉంటుంది. ఇందుకు తమవద్ద నిధులు లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఎత్తిపోతల పథకాల ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని బొల్లా కోరారు. ప్రస్తుతం ప్రజలు శుద్ధి చేయని నీటినే తాగుతున్నారు. ఇక సాగర్‌పై బ్రిటీష్ కాలం నాటి తంగిరాల డ్యామ్ నుంచి 24వేల ఎకరాలకు సాగునీరు కోసం మాచర్ల నియోజకవర్గం వెల్లుర్తి మండలం వరికపూడిశిల వద్ద రూ. 300 కోట్లతో ఎత్తిపోతల పథకం చేపట్టారు. అయితే అక్కడ రూ. 400 కోట్లు వెచ్చించి మినీ డ్యామ్ నిర్మిస్తే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చని బొల్లా సూచించారు. దీనిపై సీఎం జగన్ వెంటనే
స్పందించారు. బ్రహ్మనాయుడును తనవద్దకు రప్పించుకుని మాట్లాడారు. దీనిపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ ఆయనను వారివద్దకు పంపించారు. ఇలా అనేక సందర్భాల్లో జగన్ తక్షణం స్పందిస్తుండటంతో అధికారపక్ష సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.