రాష్ట్రీయం

హైదరాబాద్‌ను తోడేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. కాని ఇక్కడ పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడం, భూగర్భ జల మట్టాలను కాపాడలేని పరిస్థితిలో ప్రభుత్వం యంత్రాంగం చేరుకుంది. హైదరాబాద్ నగరాన్ని ఎడాపెడా తవ్వేస్తున్నారు. కోటికిపైగా జనాభాతో కిటకిటలాడే హైదరాబాద్‌లో ఏ ప్రాంతానికి వెళ్లిన కనీసం అరడజను గొట్టపుబావులు తవ్వే రిగ్‌లు దర్శనమిస్తాయి. అనుమతులు ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు. పగలు,రాత్రి ఈ రిగ్‌లు పనిచేస్తాయి. అధికారుల అనుమతులు ఉండవు. గృహ యజమానులు, అపార్టుమెంట్ సొసైటీల నీటి కొరతను భరించలేక ఎక్కువ లోతుకు బోర్లను వేస్తున్నారు. ఎడాపెడా తవ్వడం వల్ల గతంలో 300 నుంచి 400 అడుగుల లోతులో ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి. ఎక్కువ లోతులోకి బోర్లు వేయడం వల్ల తక్కువ లోతులో ఉన్న బోర్లలో నుంచి నీళ్లు రావడం లేదు.
ప్రస్తుతం అమీర్‌పేట, జూబ్లీహిల్స్, తిరుమలగిరి, కుత్బుల్లాపూర్, మారేడుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాలు ప్రమాదకరమైన జోన్లలో ఉన్నాయి. ఇక్కడ 700 మీటర్లకుపైగా లోతులోకి బోర్లను డ్రిల్ చేస్తున్నారు. అంటే దాదాపు భూగర్భంలో 1500 అడుగుల లోతులోకి వెళుతున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వాటర్, ట్రీ, ల్యాండ్ చట్టం ప్రకారం 120 మీటర్ల కంటే మించి లోతులోకి బోర్లను వేయరాదు. తెలంగాణ వాటర్ , ల్యాండ్, ట్రీ చట్టం జల సంరక్షణను ప్రోత్సహిస్తుంది. ఎడాపెడా భూగర్భ జలాలను వినియోగించడాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అడ్డుగోలుగా పాతాళంలోకి బోర్లను తవ్వి , ఆ నీటితో వ్యాపారం చేయడాన్ని కూడా ఈ చట్టం అనుమతించదు. రెండు వందల చదరపు మీటర్ల స్థలం ఉన్న భవనాల్లో యాజమానులు తప్పనిసరిగా ఇంకుడు గుంతలను తవ్వాలి. కాని ఇవేమీ అమలు జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంటు దాదాపు రూ. 8 నుంచి రూ.10 లక్షల వరకు సొమ్మును వెచ్చించి బోర్లను వేయిస్తున్నారు. ఒక అపార్టుమెంటులో 1000 అడుగుల లోతుకు బోర్లను వేస్తే, మరో అపార్టుమెంటులో 1500 అడుగుల లోతుకు బోర్లను వేస్తున్నారు. దీతో అపార్టుమెంట్ల మధ్య పోటీ కూడా నెలకొంది. తెలంగాణా వాటర్ ల్యాండ్, ట్రీ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. కాని ఈ అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీ చూడనట్లు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా నీళ్లు లేక చందాలు వేసుకుని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోర్లను తవ్వించుకుంటే, ప్రభుత్వం అడ్డుపడితే, ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే అధికారులు చూసీ చూడనట్లు పోతున్నారు. నగరంలో చాలా చోట్ల 25 నుంచి 30 లీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ సారి వర్షాలు సకాలంలో కురవక పోవడం కూడా బోర్లు ఎండిపోతున్నాయి. 2010-11లో 1016.17 ఎంఎం వర్షపాతం హైదరాబాద్‌లో నమోదైంది. అదే 2012-13లో 804.8 ఎంఎం, 2013-14లో 1040 ఎంఎం, 1015-16లో 1011.4 ఎంఎం, 2017-18లో 1175 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది దురదృష్టవశాత్తు ఇంతవరకు కేవలం 556 ఎంఎం వర్షపాతం నమోదైంది.

డ్రిల్లింగ్ (ఫైల్‌ఫొటో)