రాష్ట్రీయం

వర్షాభావం.. పంటలకు ‘విఘాతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో వర్షపాతం తక్కువ ఉండటం వల్ల విత్తనాలు వేసే విస్తీర్ణం అనుకున్న మేరకు జరగలేదు. గత రెండు మూడు రోజుల నుండి చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సొసైటీ సోమవారం జారీ చేసిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 292 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, 198 మిల్లీమీటర్లే కురిసింది. అంటే 32 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందని స్పష్టమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం కొమురంబీం, నిజామాబాద్, రాజన్న సిర్సిల్లా, కామారెడ్డి, సిద్ధిపేట, రంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే గత నాలుగు రోజుల్లో కురిసిన వానల వల్ల కొంత పురోభివృద్ది కనిపిస్తోంది. వచ్చే వారం పదిరోజుల్లో వానలు కాస్త మెరుగ్గా ఉంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆధునిక విజ్ఞానానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా పంచాంగ శ్రవణంలో పండితులు కూడా 2019 జూన్, జూలై నెలల్లో తగినన్ని వర్షాలు కురవకపోవచ్చని తెలిపిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఉగాది సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో శ్రీవిద్యా శ్రీధర శర్మ అనే పండితుడు మాట్లాడుతూ, 2019 వానాకాలంలో కురిసే వానల్లో 9 శాతం పర్వతప్రాంతాల్లో, 9 శాతం సముద్రంలో కురుస్తాయని, ఒక శాతమే భూమిపై కురుస్తుందని అన్నారు. పంచాంగ శ్రవణానికి అనుగుణంగానే అరేబియా, హిందూమహాసముద్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాలయాలు తదితర పర్వత ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భారీ వర్షాలే కురుస్తుండటం గమనార్హం. శ్రీశైలం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, మంజీరా, సింగూరు, జూరాల జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో భారీ వానలు లేకపోవడంతో ఈ జలాశయాల్లోకి నీరు చేరడం లేదు. అలాగే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో కుంటలు, చెరువుల్లోకి కూడా నీరు రాలేదు. ఈ కారణంగానే వరివిస్తీర్ణం బాగా తక్కువగా ఉంది. 25 లక్షల ఎకరాల్లో వరిసాగు కావలసి ఉండగా, మూడు లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి. జొన్న, మొక్కజొన్న, రాగులు యాభై శాతం విస్తీర్ణంలో వేశారు. పప్పు్ధన్యాలు 10 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా, ఎనిమిది లక్షల ఎకరాల్లో వేశారు. మొత్తం మీద అన్ని పంటలు కలిపి 110 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా, 55 లక్షల ఎకరాల్లోనే వేశారు.
ఆశాజనకమే..
ఐఎండీ నివేదికలను పరిశీలిస్తే వచ్చే వారం పదిరోజుల్లో మంచి వానలే కురిసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, వరి మినహా వర్షాధార పంటల పరిస్థితి బాగానే ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే పంటల విస్తీర్ణం బాగానే ఉందన్నారు. సమృద్ధిగా వానలు పడి జలాశయాల్లోకి నీళ్లు వస్తే వరి విస్తీర్ణ కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఇలా ఉండగా రాష్ట్రంలో రైతుబంధు పథకం సజావుగా కొనసాగుతోందని పార్థసారథి వివరించారు.