రాష్ట్రీయం

26నుండి డీఎస్సీ అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 22: డీఎస్సీ 2018 ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలో ఉన్న టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ హిందీ, తెలుగు మినహా) అభ్యర్థుల వివరాలు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీఎస్‌ఈ) వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కే సంధ్యారాణి తెలిపారు. 23వ తేదీ ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలో ఉన్న అభ్యర్థుల ఫోన్‌లకు సంక్షిప్త సమాచారం పంపుతామని, సమాచారం ప్రకారం 24, 25 తేదీల్లో సర్ట్ఫికెట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. జూలై 26, 27తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ హిందీ, తెలుగు మినహా) అభ్యర్థులకు, 28, 29 తేదీల్లో టీజీటీలకు సర్ట్ఫికెట్ల పరిశీలన ఉంటుందని, నిర్దేశించిన కేంద్రాల్లో సదరు అభ్యర్ధులు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.