రాష్ట్రీయం

హిందూ సంప్రదాయాల్లో కోర్టుల జోక్యం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: హిందూ సంప్రదాయాల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. శుక్రవారం ఇక్కడ ఫిల్మ్‌నగర్‌లో దైవ సన్నిధానం వద్ద సీతారాముల కళ్యాణం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో ముచ్చటిస్తూ, సంప్రదాయాలను బట్టే మతం ఉంటుందన్నారు. శబరిమలలో వృద్ధులైన మహిళలు, బాలికలకు ప్రవేశం ఉందన్నారు. కాని అక్కడ మహిళల ప్రవేశంపై మొదటి నుంచి కొన్ని నియమాలు ఉన్నాయన్నారు. భారతదేశంలో ప్రతి హిందువు చట్టాన్ని గౌరవిస్తున్నారన్నారు. ఇంటికి దీపం ఇల్లాలని, హిందూమతంలో అమ్మవారిని ఆరాధిస్తామన్నారు. ఏ ధర్మంలోనూ ఈ విధమైన ఆరాధన కనపడదన్నారు. హిందూమతం మహిళల పట్ల వివక్షతతో ఉందనే ప్రచారం సరికాదన్నారు. ఇదంతా చూస్తుంటే కుట్ర ఏమైనా జరుగుతోందా అనిపిస్తుందన్నారు. కొన్ని మతాల్లో మహిళల ముఖం కనిపించకుండా బట్టలు ధరిస్తారని, ఆ తరహా వివక్ష హిందూమతంలో లేదన్నారు. మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ముందు ఆ మతానికి చెందిన ధార్మిక సంస్ధలు, పీఠాధిపతులను సంప్రదించడం మంచిదన్నారు. గర్భధారణ, రుతుస్రావం తదితర కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో మహిళలు దేవాలయాల్లోకి రారని ఆయన చెప్పారు. కేవలం మైనార్టీ ఓటు బ్యాంకు దృష్టితోనే మైనార్టీలు, వారి మత సంప్రదాయాల జోలికి ప్రభుత్వాలు వెళ్లడం లేదని ఆయన అన్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు హిందువుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నాయన్నారు.

ఎస్‌ఐ అభ్యర్థుల నేరచరిత్ర
పరిశీలనకు ఈ-వెరిఫికేషన్
టి.పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: పోలీసు శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు నేరచరిత్ర ఏమైనా ఉందేమోనని పరిశీలన చేసేందుకు ఈ-వెరిఫికేషన్ పద్దతి అవలంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఇందుకోసం వాల్యూపిట్చ్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ విధానంలో తాము క్రిమినల్ కేసుల్లో ఉన్నట్లు 487 మంది అభ్యర్థులు తమంత తాముగా వెల్లడించారని ఆయన తెలిపారు. దాదాపుగా 2 లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే కేవలం 487 మంది మాత్రమే క్రిమినల్ కేసుల్లో ఉన్నట్లు స్వయం ధృవీకరణ ఇవ్వగా, చాలా మంది ఆ వివరాలను భర్తీ చేయకుండా వదిలి వేస్తున్నారని చెప్పారు. కానీ సమాచారాన్ని దాచడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, ఉద్యోగంలో ఎంపికైనప్పుడు నేర చరిత్ర ఉన్నట్లు ధృవీకరణ అయితే ఉద్యోగానికి అనర్హులవుతారని పూర్ణచంద్రరావు తెలిపారు. అయితే నేర చరిత్ర ఉన్నట్లు ధృవీకరించడం వల్ల ప్రస్తుతం రాసే పరీక్షకు ఎలాంటి అడ్డంకి ఉండదని, ఉద్యోగానికి ఎంపికైన తర్వాతే ఈ అంశాన్ని లోతుగా పరిశీలించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి దాచకుండా తమకు ఏదైనా నేరచరిత్ర ఉంటే ఆ సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు.

సిబిఐ కోర్టుకు జగన్
మనీలాండరింగ్ కేసు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్‌పై మనీ లాండరింగ్ చట్టం కింద నమోదైన కేసులను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు నుంచి సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదలాయించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నుంచి సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదలాయించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అంతకు ముందు సిబిఐ ఈ కేసులో ఈ సంస్థలపై కేసులు నమోదు చేసింది.