రాష్ట్రీయం

శ్రీవారిని దర్శించుకున్న బిశ్వభూషణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా రావడం తనకెంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గవర్నర్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా మంగళవారం శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు విచ్చేసిన బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు. తిరుమల క్షేత్రాన్ని వరాహ క్షేత్రంగా పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువుదీరడానికి వరాహ స్వామి స్థలం ఇచ్చినట్లు పురాణాలు ఉటంకిస్తున్నాయి. అందుకే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే తీర్థ్ఫలం సంపూర్ణంగా దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఇదే విషయాన్ని టీటీడీ నిరంతరం ప్రచారసాధనాల ద్వారా భక్తులకు తెలియజేస్తోంది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్‌ఎల్ నరసింహన్ తిరుమల పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ముందుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ శ్రీవారి పుష్కరణిలో పుణ్య జలాలను చల్లుకుని వరాహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓ ఎకె సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని ముందుగా గవర్నర్‌కు వివరించారు. అధికారులు చెప్పిన సంప్రదాయాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు పాటించి ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఆయన శ్రీవారి దర్శనార్థం పద్మావతి అతిధిభవనంలో ప్రత్యేక వాహన శ్రేణిలో రాంభగీచా అతిధి భవనం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈఓ, ప్రత్యేకాధికారి వారికి స్వాగతం పలికారు. అనంతరం బ్యాటరీ కారులో గవర్నర్ దంపతులు వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకోవడానికి బ్యాటరీ కారులో బయలుదేరారు. రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు బుధవారం చేపట్టనున్న నేపథ్యంలో గవర్నర్ దంపతులను వయోవృద్ధులను పంపే బయోమెట్రిక్ నుంచి అధికారులు ఆలయంలోనికి తీసుకెళ్లారు. బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఉంటే ఆలయ మర్యాదైన ఇస్తికఫాల్‌తో స్వాగతం పలికి ఆలయ మహాద్వారం వద్ద అధికారులు తీసుకువెళ్లి ఉండేవారు. కాగా ఆలయంలోకి ప్రవేశించిన గవర్నర్ దంపతులను అధికారులు మూలవిరాట్ కొలువుదీరి వున్న సన్నిధిలోకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు రెండు నిమిషాల పాటు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి వైభవాన్ని, ఆలయ విశిష్టతను, క్షేత్ర విశిష్టతను, ఆభరణాల విశిష్టతను హిందీలో వివరించారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న గవర్నర్ దంపతులు రంగనాయకుల మండపం చేరుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం గవర్నర్ పద్మావతి అతిధిగృహానికి చేరుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ ఆలయం ముందు విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనుండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా దివ్యానుభూతిని కలిగించిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ చాలా బాగుందని కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ ఇన్‌చార్జ్ డిప్యూటీ ఈఓ వెంకటయ్య, ఆలయ ఓఎస్డీ శేషాద్రి, ఆర్డీఓ కనకనరసారెడ్డి పాల్గొన్నారు.
పద్మావతి అమ్మవారిని
దర్శించుకున్న హరిచందన్
శ్రీవారి దర్శనానంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీకి కొత్తగా నియమితులైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పి.బసంత్ కుమార్, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, అర్చక బృందం కలిసి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనంలో కుంకుమార్చన, వేదాశీర్వచనం చేశారు. అనంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ విలేఖరులతో మాట్లాడుతూ ముందుగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

చిత్రం...తిరుమలలో శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్