తెలంగాణ

మజ్లిస్ సంగతి ధూల్‌పేట వాసులే చూసుకుంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: ‘్భరత్ మాతాకీ జై అనకపోతే మజ్లిస్ సంగతిని ధూల్‌పేట వాసులే చూసుకుంటారు..’ అని బిజెపి ఎంపి సాక్షిమహారాజ్ హెచ్చరించారు. ధూల్‌పేటలో గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఏర్పాటు చేయించిన భారీ శ్రీవీరాంజనేయ స్వామి విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు సాక్షిమహారాజ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అణచి వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టారని తెలిపారు. భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని దేశంలోని హిందువులే కాకుండా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అనాలని అన్నారు. భారత్ మాతాకీ జై అని అనేందుకు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నిరాకరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సంగతిని ధూల్‌పేట వాసులే చూసుకుంటారని ఆయన హెచ్చరించారు.
ఇలాఉండగా శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న సాద్వి ప్రాచీ మాట్లాడుతూ భారత దేశంలో జన్మించి కొంత మంది పాకిస్తాన్ పాట పాడుతున్నారని నిప్పులు చెరిగారు. భారత్ మాతాకీ జై అనని మజ్లిస్ పార్టీని యువకులు తరిమి కొట్టాలని అన్నారు. హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని, శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. ధూల్‌పేట ఆకాశ్ హనుమాన్ మందిర విగ్రహం భాగ్యనగరానికే తలమానికమని అన్నారు. హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో సాద్వి దేవ ఠాకూర్, ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. హనుమాన్ విగ్రహ రూపశిల్పి లక్ష్మీనారాయణ సింగ్‌ను సాక్షిమహారాజ్, సాద్వి ప్రాచీ, సాద్వి దేవ ఠాకూర్, ఎమ్మెల్యే రాజా సింగ్ సన్మానించారు. ఈ ఆకాశ్ హనుమాన్ విగ్రహం హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా ఆలయ నిర్వాహకులకు దీనిని అధికారులు అందజేశారు.
నలు దిశలుగా శోభా యాత్రలు
ఇలాఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో శ్రీరాముని శోభాయాత్రలు నలు దిశలుగా అంగరంగ వైభవంగా ప్రారంభమై కోఠిలోని హనుమాన్ వ్యాయామ శాల వద్దకు చేరుకున్నాయి. అయితే శుక్రవారం కావడం వల్ల చాలా చోట్ల పోలీసులు 2 గంటలకు నమాజు పూర్తయిన తర్వాతే శ్రీరాముని ఊరేగింపులకు అనుమతించారు. ధూల్‌పేటలో ఊరేగింపును సాక్షిమహారాజ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. సీతారాంబాగ్ వద్ద భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు, బిజెపి నాయకుడు డాక్టర్ భగవంత్ రావు జెండా ఊపి ఊరేగింపును ప్రారంభించారు.
ఉగ్రవాదాన్ని అణచి వేయాలి
ఇలాఉండగా వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన శ్రీరాముని శోభా యాత్రలు సాయంత్రం కోఠిలోని హనుమాన్ వ్యాయామ శాల వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శోభాయాత్రలో పాల్గొన్న వారిని ఉద్దేశించి భోపాల్‌కు చెందిన ధార్మికవేత్త మహావీర్ వైభవ్ భట్వేల్ ప్రసంగిస్తూ ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుందని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో ఏరి పారేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో హిందూ సమాజం ప్రపంచానికి గురువులా మారుతుందని అన్నారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ ప్రసంగిస్తూ గోరక్షణ చేయాలని సూచించారు. ఆయన తన ప్రసంగంలో రామాయణం విశిష్టత గురించి వివరించారు.