ఆంధ్రప్రదేశ్‌

డికె పట్టాల్లోనూ రొయ్యల చెరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 15:రాష్ట్రప్రభుత్వం ఇకనుండి డికె పట్ట్భాముల్లోను రొయ్యల,చేపల పెంపకం చేపట్టే విధంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపధ్యంలో రాష్టవ్య్రాప్తంగా మత్స్యసంపద భారీగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం ఆ మేరకు 128జివోను ఈనెల 4న విడుదల చేయటంతో డికెపట్టాల్లో అధికారికంగా రొయ్యల, చేపలసాగును రైతులతోపాటు, పారిశ్రామికవేత్తలు చేసుకోనున్నారు. ఇప్పటివరకు అనధికారికంగా రొయ్యలసాగును డికె పట్టాల్లో రైతులు సాగుచేసుకుంటున్నారు. కాని ప్రభుత్వ ఉత్తర్వులతో ఇకనుండి వారికి కూడా కోస్టల్ ఆక్వాకల్చర్ లైసెన్స్‌లు రానున్నాయి. ఈలైసెన్సులు వస్తే రాష్ట్రప్రభుత్వకల్పించే రాయితీలన్ని రొయ్య,చేపల రైతులు వచ్చే అవకాశాలున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 1645హెక్టార్లల్లోని డికె పట్టాల్లో రొయ్యలసాగు చేస్తున్నట్లు మత్స్యశాఖాధికారులు గుర్తించారు. కొంతమంది రైతులు సరైన వసతులు లేక రొయ్యల సాగును నిలిపివేసిన పరిస్థితులు నెలకొన్నాయి.ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆక్వాకల్చర్ ఉండగా ఎక్కువగా కృష్ణా జిల్లాలోనే ఉన్నట్లు మత్స్యశాఖ వర్గాల ద్వారా సమాచారం. డికెపట్టాల్లో రొయ్యలసాగు చేసుకునే రైతులకు కోస్టల్ ఆక్వా కల్చర్ లైసెన్స్‌లు వస్తే ఇకనుండి ప్రభుత్వపరంగా ఎన్నో రాయితీలు అందనున్నాయి. ముఖ్యంగా రొయ్యల చెరువులకు కరెంటు సౌకర్యం, ఏరియేటర్స్, సోరాల్ పంపుసెట్స్‌ను రాష్ట్రప్రభుత్వం డికె పట్టాల్లో సాగుచేస్తూ లైసెన్స్‌లు పొందిన వారికి రాయితీలను అందించనున్నట్లు జిల్లా మత్స్యశాఖాధికారి కె లక్ష్మినారాయణ ఆంధ్రభూమిప్రతినిధికి తెలిపారు. కాగా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మాకమైన నిర్ణయంతో కోస్తాప్రాంతంలోని డికె పట్ట్భాముల్లో సాగుచేసే, చేయబోయే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం మత్స్యశాఖలో డబుల్ డిజిట్ ద్వారా అభివృద్ధిని సాధించే విధంగా ఈచర్యలు తీసుకుంటున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ జిల్లాకు విచ్చేసి మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఎన్నో అభివృద్ధికార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం రొయ్యల రైతుల సంక్షేమానికి కృషిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు పండించిన రొయ్యలసాగుకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని రొయ్యల వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను పతానావస్ధకు తీసుకువస్తున్నారు. దీంతో రొయ్యరైతులకు రొయ్యల పంట బాగా వచ్చిన సమయంలోరేట్లు తగ్గించటం, పంట తగ్గిన సమయంలో రేట్లను పెంచటం జరుతుంది. ముఖ్యంగా రొయ్యల రైతులను ఆదుకునేందుకు ధరలను స్ధిరీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు
విస్తృతంగా ఏర్పాట్లు : గంటా
ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఏప్రిల్ 15: మరో అయోధ్యగా పేరుగాంచి దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్న కడప జిల్లా ఒంటిమిట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ గత ఏడాది నుంచి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఒంటిమిట్ట కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయన స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్టవ్రిభజన అనంతరం భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోగా, 14వ శతాబ్దానికి చెందిన ఎంతో ప్రాచుర్యం ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం ఎంతో అదృష్టమన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం తరఫున అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని ఎంపిక చేశారన్నారు. అనంతరం ఒంటిమిట్టను తిరుమల తిరుపతి దేవస్థానంలోకి విలీనం చేయడం తెలిసిందేనన్నారు. ప్రస్తుతం టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల నిర్వహణ ఎంతో అద్భుతంగా ఉందన్నారు. 100 కోట్ల రూపాయల మాస్టర్ ప్లాన్‌తో కోదండరామస్వామి దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతోందన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన జరిగే కోదండరామస్వామి కల్యాణానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు రానున్నారని ఆయన పేర్కొన్నారు. ఒంటిమిట్టలో కల్యాణోత్సవ వేడుకకు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారన్నారు.

బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి కృషి.: కారెం
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీచేయించడానికి శాయశక్తులా కృషిచేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ అన్నారు. శుక్రవారం అమలాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఆయన క్యాంపు కార్యాలయంలో శివాజీ మర్యాద పూర్వకంగా కలిశారు. తన పట్ల నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా తనను నియమించినందుకు శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, దళిత మంత్రులు ఎంతో కృషిచేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దళితుల పట్ల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆది నుండి ఎంతో ఆప్యాయత కనబరిచారన్నారు. దివంగత జిఎంసి బాలయోగి నుండి తన వరకూ గౌరవప్రదమైన పదవులను దళితులకు కల్పించారన్నారు.

రాజ్యసభ లక్ష్యంగా టిడిపి ఆకర్ష్

వైకాపాకు ఝలక్ ఇచ్చే వ్యూహంతో దూకుడు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 15: రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను చావు దెబ్బతీసే వ్యూహంతో అధికార తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో అవసరమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ విపక్షం నుంచి పెద్దఎత్తున ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడం వెనుక రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలే లక్ష్యం అని తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల గెలుపును నిలువరించాలంటే ఆపార్టీ బలాన్ని పూర్తిగా తగ్గించాలన్న వ్యూహంతో తెలుగుదేశం పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 67 మంది సభ్యుల బలం ఉంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో వైకాపా తప్పనిసరిగా ఒకటి, కొద్దిగా కష్టపడితే రెండు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. వైకాపా శాసనసభ్యుల్లో ఇప్పటికే 12 మంది అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మరికొంత మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు టిడిపి నేతలు అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల నాటికి మరో 20 మంది ఎమ్మెల్యేలను వైకాపా గూటి నుంచి ఆకర్షించగలిగితే ఆపార్టీ రాజ్యసభ సీటు గల్లంతవడం ఖాయం. దీన్ని అమలు చేయాలంటే ఆయా జిల్లాల్లో మంత్రులు, సీనియర్ నాయకులు వైకాపా ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉండాల్సి ఉందని పార్టీ అధిష్టానం ఇప్పటికే సూచించినట్టు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో వైఎస్సార్ పార్టీకి తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైకాపా తరపున ముగ్గురేసి ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో శ్రీకాకుళం జిల్లా నుంచి కలమట వెంకటరమణ ఇప్పటికే తెలుగుదేశంలో చేరిపోగా, రాజాం నుంచి గెలిచిన కంబాల జోగులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావుతో సన్నిహిత సంబంధాలున్న జోగులు పార్టీలో చేరికపై స్పష్టత వచ్చిందని తెదేపా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక శ్రీకాకుళంలో మరో మహిళా ఎమ్మెల్యేతో టిడిపి వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. విజయనగరం జిల్లాలో రంగారావుతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందగా, రంగారావు టిడిపిలో చేరడం దాదాపు ఖరారైపోయింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. విశాఖ జిల్లాలో పార్టీ తరపున గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు గిరిజన తెగలకు చెందిన వారే. వీరిలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జగన్ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తుండగా, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాత్రం తన రాజకీయ గురువు, వైకాపా మాజీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కొణతాల సైతం తెదేపాలో చేరడంపై కొద్ది నెలలుగా విస్తృత ప్రచారం జరుగుతున్నప్పటికీ స్థానిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆలస్యం అవుతోంది. కొణతాల చేరికకు ఉన్న అడ్డంకులు తొలగితే, అరకు ఎమ్మెల్యే సైతం తెదేపా తీర్థం పుచ్చుకోడవం ఖాయం.

21న కదిరి ఎమ్మెల్యే జంప్?
కదిరి, ఏప్రిల్ 15: అనంతపురం జిల్లా కదిరి వైకాపా ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టిడిపిలోకి చేరేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 21 జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా అదే రోజు జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి సమక్షంలోనే టిడిపి కండువా వేసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అత్తార్ పదే పదే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చారు. అయితే కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పార్టీ మారాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. నియోజక వర్గంలో ఎవరైనా సరే ఎమ్మెల్యేగా ఒక్కసారే గెలుస్తున్నారని, పార్టీ మారటం ద్వారా కలిగే ప్రయోజనాన్ని వదులుకోవద్దనే సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో అత్తార్ పార్టీ మారేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో టిడిపి నేత నారా లోకేష్‌ను కలసినట్టు తెలిసింది. కాగా గతంలో అత్తార్ టిడిపి పార్టీలోవున్న వ్యక్తే కావడంతో జిల్లా నాయకులు, అదే విధంగా యువ నాయకుడు నారా లోకేష్‌తో సహా అందరితో అత్తార్‌కు సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నప్పుడు ఆయన చొరవతో అత్తార్ రెసిడెన్సీ ప్రారంభోత్సవానికి సైతం నారా లోకేష్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.