రాష్ట్రీయం

జల దుర్భిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: జల దుర్భిక్షం తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. నగరాల నుంచి గ్రామాల వరకు ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం నానాయాతనలు పడుతున్నారు. మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. తెలంగాణలో గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు లోలోపలికి పోతున్నాయి. రాష్ట్రంలోని 140 మండలాల్లో 20 మీటర్ల లోతుకు నీటి మట్టాలు దిగజారాయి. మరో 90 మండలాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇక్కడ 15 నుంచి 20 మీటర్ల మధ్య అంతంతమాత్రంగా నీరు లభ్యమవుతోందని తెలంగాణ భూగర్భ జల శాఖ డైరక్టెర్ జి సాంబయ్య తెలిపారు. 1999 మార్చి నెలలో 10.42 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా, 17 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మార్చిలో సగటున 15.26 మీటర్ల లోతుకు జల సంపద పడిపోయింది. రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో మహారాష్ట్ర లాతూర్‌లో నెలకొన్న పరిస్ధితులు దర్శనమిస్తున్నాయి. దిల్వార్‌పూర్‌లో భూగర్భ జల మట్టాలు 23.62 మీటర్లకు పడిపోగా, బోథ్, ఇంద్రవెల్లి, జినూర్, గుడిహత్నూర్‌లో కూడా నీటి చుక్క లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. జల సంపద ఉన్నచోట రైతుల నుంచి ఐదు వేల బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు రూ. 65 కోట్లు, పట్టణప్రాంతాలకు రూ. 36.68 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్ర రాష్ట్రంలోని 10 జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. పచ్చటిపైర్లతో కళకళలాడే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా భూగర్భ జల మట్టం మార్చి 15 నాటికి 11.03 మీటర్లకు పడిపోయింది. గత ఏడాది నవంబర్ నెలలో భారీ వర్షాల వల్ల చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో భూగర్భ జలాల్లో స్వల్ప వృద్ధి నమోదైనా, నీటి కటకట మాత్రం కొనసాగుతోంది.
శ్రీకాకుళం మొదలుకొని ప్రకాశం దాకా అన్ని కోస్తా జిల్లాలోను గత ఆరు నెలల్లో భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పడిపోయాయి.
రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో 13 చోట్ల భూగర్భ జలాల పరిస్ధితి ఆందోళన కరంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద వంద చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని భూగర్భ జల శాఖ సర్వేలో గుర్తించింది. నూజివీడు మండలం పల్లేర్ల మూడి గ్రామంలో 46.71 మీటర్ల లోతుకు భూగర్భ నీటి మట్టం పడిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరులో 95.74 మీటర్ల లోతులో నీళ్లు లభ్యమవుతున్నాయంటే పరిస్ధితి ఎంతగా క్షీణించిందో అర్థమవుతుంది. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు మూడు వేలకు పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.