రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రమాలల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా సోమవారం వైభవంగా పవిత్ర మాలల సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ విలేఖరులతో మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ, తెలియక జరిగిన దోషాల నివారణకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తిరుమలలో 15వ శతాబ్దం వరకు పవిత్రోత్సవాలు జరిగినట్లు ఆధారాలున్నాయని, 1962వ సంవత్సరం నుండి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందని వివరించారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం స్నపనతిరుమంజనం నిర్వహిస్తున్నామని, సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన అభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. మంగళవారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ సమయం సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. పవిత్రోత్సవాల్లో రెండవ రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 9నుండి 11గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవరులకు 8, భోగశ్రీనివాసమూర్తికి 1, కొలువు శ్రీనివాసమూర్తికి 1, ఉగ్రశ్రీనివాసమూర్తికి 3, శ్రీరాముల వారికి 3, శ్రీకృష్ణస్వామివారికి 2, చక్రత్తాళ్వార్‌కు 1, జయ విజయులకు 2, గరుడాళ్వార్‌కు 1, శ్రీవరదరాజస్వామివారికి 1, పోటు తాయారుకు 1, ఆనంద నిలయ విమానానికి 6, పరివార దేవతలకు 6, విష్వక్సేనుల వారికి 1, శ్రీ యోగనరసింహస్వామివారికి 1, భాష్యకార్లకు 2, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి 3, ప్రధాన కుంభానికి 2, పరివార కుంభాలకు 16 పవిత్రమాలలను సమర్పించారు. శ్రీ వరాహస్వామివారి ఆలయంలో మూలవరులకు 1, ఉత్సవరులకు 2, జయవిజయులకు 2, విష్వక్సేనుల వారికి భాష్యకార్లకు కలిపి 2, కోనేరు ఆంజనేయస్వామివారికి 1, శ్రీబేడి ఆంజనేయస్వామివారికి 1 పవిత్రమాలలు సమర్పించారు. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావాల్సిన పవిత్రాలు చేయడానికి గాను శ్రేష్టమైన జాతిపత్తిమొక్కలను, అత్యంత పవిత్రమైన తులసీ మొక్కలను పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ, లేదా 200మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దుతారు. సాయంత్రం 6 నుండి 8గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహించారు. రాత్రి 8 నుండి 11గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల కారణంగా విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ రద్దయ్యాయి. ఈ కార్యక్రమంలో సివిఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, విఎస్‌ఓలు మనోహర్, ప్రభాకర్, పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్ర మాలల సమర్పణ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడై తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీమలయప్ప స్వామి