రాష్ట్రీయం

అధికార విధుల్లో హాస్య దొంతరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: అధికార విధుల్లో ఎంతగా తలమునకలైనా, ఓ అధికారి తన దైనందిక జీవితంలో మరిచిపోలేని హాస్యస్ఫూరక ఉదంతాలు ఎన్నో ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రిటైర్డు ఐఏఎస్ అధికారి శ్రీపాద భలేరావు రచించిన ‘విత్ టంగ్ ఇన్ చీక్-ఏ సివిల్ సర్వెంట్ రీకాల్స్’ పుస్తకాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు కె పద్మనాభయ్య, ఉమాపతిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన ఎస్‌కే జోషి మాట్లాడుతూ, సివిల్ సర్వెంట్ల జీవితాల్లో హాస్యం, చతురోక్తులు అనేవి అనివార్యంగా పెనవేసుకుంటాయన్నారు. ఈ విషయాన్ని భలేరావు రచించిన పుస్తకంలో ఆయన గొప్పగా ఆవిష్కరించారన్నారు. దీనిని చదివిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆస్వాదిస్తారని, ఆనందిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత, రిటైర్డు సివిల్ సర్వెంట్లు వంద మంది దాకా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన సుప్రియా భలేరావు చేసిన వ్యాఖ్యానం మరింత ఆహ్లాదకరంగా సాగింది.