రాష్ట్రీయం

ముంపు రైతులకు భరోసా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 12: కృష్ణానదికి పెద్దఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వరద ఉద్ధృతి చేరడంతో పర్పీవాహక గ్రామాలు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఈ సందర్భంగా బాధిత రైతులకు, ప్రజలకు మనోధైర్యం దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. సోమవారం కృష్ణానది ఒడ్డున వరదకు గురైన ప్రాంతాలు రేకులపల్లి, నదిఅగ్రహారం, తెలుగోనిపల్లి, బీరెల్లి, లత్తిపురం, బీచుపల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా వేలాది ఎకరాలు పంట నష్టపోయిన రైతులు ఆమెను పట్టుకొని బోరున విలపించారు. ముఖ్యంగా రేకులపల్లి వద్ద జెన్‌కో అధికారులు నిర్మించిన దిగువజూరాల ఆనకట్ట కారణంగా కొన్ని ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఇందుకు అధికారులు నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం బాధిత వరద బాధితులకు అండగా ఉండాల్సింది పోయి ఇప్ప టికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం దు ర్మార్గమన్నారు.
బాధితుల పక్షాన ఉండి రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. వరి, వేరుశెనగ, పత్తి, పంట తోట లు సైతం ముంపునకు గురయ్యాయని, మరో మూడు రోజులు వరద ఉద్ధృతి ఇలా గే ఉండే పరిస్థితి ఉందని, దీంతో పంటలు తీవ్రంగా నష్టపోవాల్సిందేనని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రామిరెడ్డి, బండల వెంకట్రాములు, నాగేందర్‌యాదవ్, అంజి, భాస్కర్‌యాదవ్ తదితరులున్నారు.

చిత్రం...బీరెల్లి వద్ద వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ