రాష్ట్రీయం

నిందితులను కఠినంగా శిక్షిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 12: దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమె ఆత్మహత్యకు కారకులైన నిందితులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని, వారికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీనిచ్చారు. సోమవారం హన్మకొండ సమ్మయ్య నగర్‌లోని బాలిక కుటుంబాన్ని మంత్రి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పరామర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వరంగల్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మొన్ననే తొమ్మిది నెలల పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి చట్టం సరైన శిక్ష విధించిందని అదే తరహాలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె ఆత్మహత్యకు కారకులైన దుండగులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అంతకంటే త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు హైదరాబాద్ తరహా ప్రత్యేక షీ టీంలను ఏర్పాటు చేస్తామన్నారు. విపక్షాలు ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయకుండా ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. మహిళలపై కనె్నతి చూసిన కఠిన చర్యలు ఉంటాయనే విధంగా చైతన్యం చేయాలని ఆయన కోరారు. మహిళలపై ఆఘాత్యానికి పాల్పడిన వారికి మరణశిక్ష ఉంటాయనే విషయాన్ని ప్రచారం చేయాలని అన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా కాలనీ మహిళలు మంత్రి దయాకర్‌రావుకు అనేక పిర్యాదులు చేశారు. ఈ కాలనీలో ఆకతాయిలు పేట్రేగిపోతున్నారని, పోలీసుల నిఘా కరవైందని చెప్పారు. గతంలో పోలీస్ పెట్రోలింగ్ ఉండేవని ఇటీవల కాలంలో అలాంటివి లేకపోవడం వల్లే ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ దళిత మైనర్‌పై ఆఘాయిత్యానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. ఇదిలా ఉండగా బాలికపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ సెంటర్‌లో నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.