రాష్ట్రీయం

విద్యుత్ రెవెన్యూ ఆఫీసులో షార్ట్‌సర్క్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, ఆగస్టు 12: ఒంగోలు నగరంలోని కొణిజేడు బస్టాండులో సోమవారం విద్యుత్‌శాఖ రెవెన్యూ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలోని ఫర్నిచర్‌తోపాటు కంప్యూటర్లు, కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు 10లక్షల రూపాయలకు పైగా ఆస్తినష్టం జరిగిందని విద్యుత్‌శాఖ జిల్లా ఎస్‌ఈ ఎన్‌విఎస్‌ఎస్ సుబ్బరాజు విలేఖర్లకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.30గంటలకు ఉద్యోగులు విధులు నిర్వహించారని 2.30గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగటం వలన బయటకు పొగ వస్తుండటంతో గమనించిన వాచ్‌మెన్ అధికారులకు తెలపారన్నారు. వెంటనే విద్యుత్‌శాఖాధికారులు రంగంలోకి దిగి ఫైర్‌స్టేషన్‌కు ఫోన్ చేయడంతో ఫైర్ స్టేషన్ అధికారులు హుటాహుటినా అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు 4గంటలకు పైగా ఫైర్‌స్టేషన్ అధికారులు కష్టపడి మంటలను ఆర్పినప్పటికీ విలువైన కంప్యూటర్లు, ఫర్నీచర్, కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయన్నారు. అయితే కంప్యూటర్లు కాలిపోయినప్పటికి వాటి సమాచారం సర్వర్‌లో భద్రంగా ఉందన్నారు. ఈసందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని అన్నారు.