రాష్ట్రీయం

భారీ వర్షాలతో రైళ్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: దక్షణాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌కు వచ్చిపోయే కొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రయాణికుల కోసం ప్రతి రెండు గంటలకు ఒకసారి న్యూస్ బులిటెన్‌లను విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయ వెలేల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తమిళనాడు, కేరళ వెళ్ళే రైళ్లను తాత్కాలింగా రద్దు చేశారు. ధన్‌బాద్ నుంచి ఆల్‌పుజ్‌హ వెళ్ళే రైలును రద్దు చేశామన్నారు. బరౌనీ నుంచి ఎర్నాకుళం వెళ్ళే రైలును రద్దు చేశారు. తిరుపతి- కొల్హాపూర్- తిరుమతి మధ్య నడిచే హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. ఆజ్మీర్ నుంచి బెంగళూరు వెళ్ళే గరీబ్‌నవాజ్ ఎక్స్‌ప్రెస్ రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. రద్దు అయిన రైళ్లను మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించే సమాచారాన్ని న్యూస్ బులిటెన్‌లో వివరిస్తామని రైల్వే సీపీఆర్‌వో రాకేష్ తెలిపారు.