రాష్ట్రీయం

మోటూరు, ఆకివీడు మధ్య రెండో రైల్వే లైన్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 12: కృష్ణా జిల్లా మోటూరు, ఆకివీడు రైల్వే స్టేషన్ల మధ్య రెండో రైల్వే లైనును సోమవారం రైల్వే అధికారులు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే గుడివాడ- భీమవరం సెక్షన్ పరిధిలోని ఈ రెండు స్టేషన్ల మధ్య రెండో లైను, విద్యుద్దీకరణ పనులు పూర్తి కావడంతో 17231 (నర్సాపురం-నాగర్‌సోల్) రైలును నడిపి ప్రారంభించారు.
ఐదు దశల్లో 1501 కోట్ల రూపాయలతో విజయవాడ-మోటూరు, మోటూరు-భీమవరం టౌన్, భీమవరం టౌన్-నిడదవోలు, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం -నర్సాపురం మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుద్దీకరణ ప్రాజెక్టును రైల్వే శాఖ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరిస్తుంది. 2020-21 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆకివీడు- భీమవరం టౌన్ మధ్య పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.