రాష్ట్రీయం

భవిష్యత్తు టీడీపీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రెండు నెలల క్రితం పార్టీ ఓటమి పాలయ్యాక బాధపడ్డానని, రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన వచ్చిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంక్షోభాలను ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదన్నారు. తాను ఓటమిని అంగీకరించబోనని, భవిష్యత్తు టీడీపీదేనని పునరుద్ఘాటించారు. 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ మనది అన్నారు. అధైర్య పడాల్సిన అవసరం లేదని, రాజీ పడాల్సిన పరిస్థితి అంతకన్నా లేదన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అధికార పార్టీ అరాచకాలను సమష్టిగా ఎదుర్కొందామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఓటమి నేపథ్యంలో వివిధ స్థాయిల్లో విశే్లషణలు చేశామన్నారు. పార్టీని బలోపేతం చేస్తామని, లోపాలను అధిగమించి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 13 జిల్లా కమిటీలకు అనుబంధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కమిటీలు వేస్తామన్నారు. పార్టీలో వివిధ స్థాయిల్లో యువతకు 50 శాతం మేర ప్రాధాన్యత ఇస్తామన్నారు. యువరక్తం తీసుకురావడం ద్వారా పార్టీకి దీర్ఘకాలికంగా ఉపయోగం ఉంటుందన్నారు. మరో 30 ఏళ్లు పార్టీని నడిపించాల్సింది యువతేనన్నారు. అనుబంధ సంస్థలపై ఇటీవల శ్రద్ధ తగ్గిందని, దీనిపై దృష్టి సారించాలన్నారు.
వలంటీర్ల ముసుగులో..
వలంటీర్ల ముసుగులో పేదల ధనాన్ని వైకాపా కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలను కోన్ కిస్కా గొట్టంగాళ్లు అంటూ స్పీకర్ వ్యాఖ్యానించడం గర్హనీయమన్నారు. స్పీకర్ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు గౌరవంగా ఉండాలని, హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 370 ఆర్టికల్ రద్దుకు మద్దతు ఇచ్చామన్నారు. రెండున్నర నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేశారన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేత, పెళ్లికానుక, నిరుద్యోగ భృతి, రేషను కార్డులు వంటివి నిలిపివేశారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను నిలిపివేశారన్నారు. వైఎస్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను టీడీపీ కొనసాగించిందని గుర్తు చేశారు. 21 ప్రాజెక్టులను పూర్తి చేసి ఫలితాలను ప్రజలకు అందించామన్నారు. కియా మోటార్స్ అధికారులను ఎంపీ బెదిరించడం వైకాపా అరాచాలకు పరాకాష్టగా అభివర్ణించారు. పనులు రద్దు చేస్తే అంచనా వ్యయం పెరుగుతుందని పనులు కొనసాగించామని వివరించారు. వైఎస్ పాలనలో పోలవరం టెండర్లను ప్రీ-క్లోజర్ చేశారని, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే 14 శాతం తక్కువకు వేశారన్నారు. కానీ స్థలం అప్పగించకపోవడం వల్ల సంవత్సరంన్నర ఆలస్యమైందన్నారు. పోలవరం పనులు 70 శాతం పూర్తి చేశామని, ఇప్పుడు కాంట్రాక్టు రద్దు చేయడం దురదృష్టకమన్నారు. ఐదు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. గోదావరి జలాలను తెలంగాణకు తీసుకువెళ్లడంపై అధ్యయనం చేయాలన్నారు. నీళ్లు ఎలా తీసుకువెళ్తారని ప్రశ్నించారు. నీళ్లు-నిధులు-నియామకాల కోసమై తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ వల్లే విద్యుత్ పంపిణీ సంస్థలు 8 వేల కోట్ల రూపాయల మేర నష్టాల్లో కూరుకుపోయాయన్నారు. కర్నాటకలోని తన రెండు ప్లాంట్ల విద్యుత్‌ను ఎక్కువ ధరకు జగన్మోహన్‌రెడ్డి అమ్ముకుంటారని, కానీ ఇతరులకు ఆ రేటు రాకూడదా అని విమర్శించారు. తనకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతా అని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నారన్నారు.
ఆశా, అంగన్‌వాడీ, కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల్లో అభద్రతా భావం తెచ్చారన్నారు. పీపీఏలపై, గ్యాస్ కేటాయింపులపై టీడీపీపై బురద జల్లుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వ సెక్రటరీలే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ధర భారీగా పెరిగిందని, దీంతో దోపిడీకి ఎవరు పాల్పడ్డారో అర్థం అవుతోందన్నారు. వైకాపా అరాచకాలు రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకాలు కారాదన్నారు.

చిత్రం... సమావేశానికి ముందు ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న చంద్రబాబు, ఇతర నేతలు