రాష్ట్రీయం

కృష్ణా బేసిన్‌లోకి 581 టీఎంసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: కేవలం నెలంటే నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి రంగం పూర్తిగా నిరాశా వాతావరణం నుంచి ఆశాజనకమైన పరిస్థితుల్లోకి అడుగుపెట్టింది. వరుణ దేవుడి కటావీక్షణాల వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు 20 రోజుల వ్యవధిలో నిండిపొర్లుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆనంద వాతావరణం నెలకొంది. నెల రోజుల వ్యవధిలోనే ఇరు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ ముఖచిత్రం మారింది. ప్రస్తుతం జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో కలిపి 582 టీఎంసీ నీరు చేరింది. నెల రోజుల క్రితం ఈ నాలుగు ప్రాజెక్టులు కలిపి పట్టుమని 160 టీఎంసీ నీరు కూడా లేదు. దాదాపు 420 టీఎంసీ నీరు రావడంతో రైతాంగం ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం జూరాలలో 9.66 టీఎంసీ, శ్రీశైలంలో 215 టీఎంసీ, నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీ, పులిచింతలలో 45 టీఎంసీ నీటి నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మించిన తర్వాత తొలిసారిగా 45 టీఎంసీ నీటి నిల్వ చేరడంతో కృష్ణా,గుంటూరు జిల్లాల ప్రజలకు వచ్చే ఏడాది కూడా నీటి ఎద్దడి ఉండదు. నాగార్జునసాగర్ నిండడంతో హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల తాగునీటి కొరత ఉండదు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు జూన్ నెలాఖరులో కృష్ణాబేసిన్ కింద ఆయకట్టును రక్షించే విషయమై ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఎగువున మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం వల్ల వరద నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణాబేసిన్‌లోకి ప్రాజెక్టులకు గోదావరి మిగులు జలాలను తరలించే విషయమై ఇద్దరు నేతలు ప్రాజెక్టులను నిర్మించే విషయమై చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు సిద్ధం చేస్తున్నారు. గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించాలని, దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను మళ్లించాలని పలు రకాలుగా చర్చలు సాగుతున్నాయి. దాదాపు పదేళ్లుగా ఈ ఏడాది వచ్చినట్లు వరద కృష్ణా నదికి రాలేదు. ఇరు రాష్ట్రాల సీఎంలు కృష్ణా ఆయకట్టును రక్షించే విషయమై తీవ్రంగా యోచించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల భవిష్యత్తుపై కేసీఆర్,జగన్‌లు తమ అభిప్రాయాల ను పంచుకున్నారు. ఈ చర్చలు కొనసాగుతుండగానే ఒక్కసా రి కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పరిస్థితులు చకాచకా మారిపోయాయి. శ్రీశైలంలో 31 టీఎంసీ కాస్తా 215 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజీ 126 టీఎంసీ నుం చి 312 టీఎంసీకి నీరు చేరింది. పులిచింతల ఎప్పటికి నిండుతుందనే దిగులు తొలగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నీటిని పోతిరెడ్డి పాడు, తెలుగుగంగ, ముచ్చుమర్రి, గో రకల్లు, మైలవరం, బ్రహ్మసాగర్ తదితర రిజర్వాయర్లల్లో నీటిని నింపుకుంటున్నారు. హంద్రీనీవాకు నీటిని వదులుతున్నారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా, ఇంకా వివిధ ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 40 నుంచి 45 లక్షల ఎకరాల సాగు అవుతోంది. వరద పోటెత్తడం, కృష్ణమ్మ పరుగులెత్తడంతో, దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తోంది. పైగా ఆగస్టు రెండోవారానికే ప్రాజెక్టులు నిండడంతో ఈ సారి రెండు పంటలకు సాగునీటిని ఇచ్చే యోచనలో ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. భారీ స్థాయిలో వరద రావడం వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా లభించనున్నాయి. వచ్చే వేసవికి తాగునీటి ఎద్దడి కూడా ఉండదని సాగునీటి ఇంజనీర్లు చెప్పారు.