రాష్ట్రీయం

ఇక సమృద్ధిగా పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 14: భారీ ప్రాజెక్టులతో తెలంగాణ సుభిక్ష రాష్ట్రంగా మారనుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం పర్యటనకు వచ్చారు. ముందుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటికి చేరుకున్నారు. చల్లా తండ్రి మల్లారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా గంటన్నర పాటు ఇష్టాగోష్టిగా భారీ నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కాళేశ్వరంతో పాటు శ్రీరాంసాగర్, దేవాదుల తదితర ప్రాజెక్టుల వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ సుభిక్షంగా మారుతుందని కేసీఆర్ వెల్లడించారు. నెలకు ఏడున్నర టీఎంసీల నీటిని 10 నెలలకు సరిపడా 75 టీఎంసీల నీరు పంటలకు పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రాజెక్టులు అందిస్తాయన్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలను తలదనే్న రీతిలో తెలంగాణ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంతో మేలు జరుగుతుందంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లెక్కలతో ముఖ్యమంత్రి వివరించారు. చర్చ మొత్తం నీటి వనరులు, నీటి ప్రాజెక్టులపైనే కొనసాగింది. ప్రతి అంశాన్నీ అందరికి అర్ధమ య్యే రీతిలో కేసీఆర్ వివరించినట్లు సమాచారం. ప్రాజెక్టుల విషయాలను,
వాటివల్ల జరిగే అభివృద్ధిని అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని సీఎం గుర్తు చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా మిషన్ భగీరథపై కూడా సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ పథకం పూర్తియినట్లైతే ప్రతి ఇంటికి తాగు నీరు అందుతుం దని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా చల్లా ధర్మారెడ్డి స్వగ్రామం అయిన ప్రగతి సింగారం గ్రామానికి ఆ గ్రామస్తుల కోరిక మేరకు 10 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అందరితో కలివిడిగా ముఖ్యమంత్రి గంటన్నర పాటు ఉల్లాసంగా గడిపారు.
ప్రగతి సింగారానికి కేసీఆర్
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండ లం ప్రగతి సింగారంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చల్లా మల్లారెడ్డి దశదిన కర్మ బుధవారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ప్రగతి సింగారం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన సీఎం కేసీ ఆర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. గంటన్నర సేపు చల్లా ధర్మారెడ్డి ఇంట్లోనే ఉన్నారు. జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలను చర్చించారు.

చిత్రం...వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రజలకు అభివాదం తెలుపుతున్న సీఎం