రాష్ట్రీయం

లుక్ ఈస్ట్ బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఐటీ ఎగుమతుల్లో దూసుకెళుతున్నామని, ఈ ఏడాది హైదరాబాద్ బెంగళూరును అధిగమించబోతుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ నుంచి రూ. 52 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు ఐదు సంవత్సరాలలో రూ. లక్షా 9 వేల కోట్లకు పెరిగాయని వివరించారు. ఐటీ కంపెనీలకు హైదరాబాద్ నగరం అత్యంత అనుకూలంగా ఉందన్నారు. అలాగే సరికొత్త టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు. నాలెడ్జె సిటీలో బుధవారం రియల్ ఏస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జెఎల్‌ఎల్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా
కేటీఆర్ మాట్లాడుతూ, గూగుల్, అమెజాన్ వంటి ప్రఖ్యాత ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో తమ శాఖలను ఏర్పాటు చేశాయన్నారు. అన్ని రంగాలకు హైదరాబాద్ నగరం అనుకూలంగా ఉండటంతో దేశ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తుండటంతో నగరంలో వౌలిక సదుపాయాలను మరింతగా విస్తరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మెట్రోరైలు సౌకర్యాన్ని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించబోతున్నామన్నారు. మెట్రోరైలు ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ పనులను త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ, కార్ పూలింగ్ సౌకర్యాలను ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో రియల్ ఏస్టేట్ రంగం బాగా పుంజుకుందన్నారు. ఐటీ కంపెనీలు నగరానికి ఒకవైపుననే విస్తరించకుండా నలుమూలల విస్తరించాలన్న ఉద్దేశంతో ‘లుక్ ఈస్ట్’ పాలసీని తీసుకొచ్చామన్నారు. దీంతో హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ కంపెనీల విస్తరణ మొదలైందన్నారు.
ఒక సాధారణ వ్యక్తిగానే...
గతంలో మంత్రిగా పని చేసినప్పుడు కూడా తన వాహనానికి బుగ్గకారు వినియోగించుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. తాను కూడా ఒక సాధారణ వ్యక్తి మాదిరిగానే ట్రాఫిక్‌లో ప్రయాణించానన్నారు. కేంద్ర ప్రభుత్వం వీఐపీల కార్లకు బుగ్గను నిషేధించకముందే తన కారుకు బుగ్గ కారును ఉపయోగించలేదని కేటీఆర్ వివరించారు.
చిత్రం...నాలెడ్ జ సిటీలో బుధవారం రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జెఎల్‌ఎల్ ప్రారంభ సభలో ప్రసంగిస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్