రాష్ట్రీయం

బాబు నివాసానికి తప్పిన వరద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : కృష్ణానది ఎగువ భాగంలో నదికి ఆనుకుని నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసానికి వరద ముప్పు తప్పింది. కృష్ణానది ఎగువ భాగం నుండి వచ్చే వరదనీరు ఆయన నివాసం వద్ద నుంచి ప్రకాశం బ్యారేజీకి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జలవనరుల శాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి వరదనీటి మొత్తాన్ని సముద్రంలోకి తరలిస్తున్నారు. వరదనీరు వస్తుందన్న సమాచారంతో ఈ నెల 13వ తేదీ సాయంత్రానికే చంద్రబాబు నాయుడు నివాసంలోని కింది అంతస్తులోని సామగ్రిని పై అంతస్తులోకి మార్చారు. వరద ఉద్ధృతి పెరిగితే నివాసం వైపు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యల్లో భాగంగా కంకర డస్ట్‌తో నింపిన ఆరు వేల బస్తాలతో మూడు లైన్లుగా అడ్డుకట్ట వేశారు. 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తే తప్ప భవనంలోకి నీరు చేరే ప్రమాదం ఉండదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇలావుండగా ప్రకాశం బ్యారేజీకి వచ్చిన నీరు వచ్చినట్లుగా సముద్రంలోకి వదిలి వేస్తున్నారు.