రాష్ట్రీయం

సీబీఐతో దర్యాప్తు చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో అవినీతి జరిగిందని ఇంతకాలంగా తాము చెబితే ఎవరు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఇదే మాట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా అంటున్నారని అని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి
జరిగిందని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా చేసిన ఆరోపణలు ఉత్తమ్‌కుమార్ ప్రస్తావించారు. ‘మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు చేస్తేసరిపోదు. దర్యాప్తు చేయించి నిగ్గుతేల్చండి’అని నడ్కాకు ఆయన సవాల్ విసిరారు. గాంధీభవన్ నుంచి సోమవారం పార్టీ శ్రేణులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్‌బుక్ లైవ్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు ఐదేళ్లపాటు రాసుకుని పూసుకుని తిరిగాయని, టీఆర్‌ఎస్ అవినీతి బీజేపీకి అప్పుడు గుర్తుకురాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ‘నడ్డా స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి జరిగితే దర్యాప్తునకు ఎందుకు ఆదేశించరు?’అని ఉత్తమ్ సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీద ఉన్న సీబీఐ కేసులపై ఎందుకు విచారణ జరిపించడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ప్రధాని మోదీ మెచ్చుకున్నారని, దీంతోనే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న మైత్రి ఏంటో తెలిసిపోయిందని పీసీపీ చీఫ్ అన్నారు. బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఎందుకు ఇచ్చిందో చెప్పాలన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కమిషన్లు రావనే కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో అసమర్ధత ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రజాక్షేత్రంలో పెట్టడానికి త్వరలోనే అక్కడ కాంగ్రెస్ బృందం సందర్శించనుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, గవర్నరే ఈ విషయం చెప్పారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నది కాంగ్రెస్ డిమాండ్‌గా ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ ఎప్పటికీ ప్రత్యర్థిగా ఎదగలేదని, పొరపాటును ఏవో నాలుగు సీట్లు గెలిచినంత మాత్రాన అంతా తామేనన్న భ్రమల్లో బీజేపీ నేతలు ఉన్నారని విమర్శించారు. మతతత్వ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలు లౌకికవాదులని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ నేతల దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన త్యాగాలను బీజేపీ నేతలు తక్కువ చేసి చూపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని పీసీసీ చీఫ్ మండిపడ్డారు.

చిత్రం... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి