రాష్ట్రీయం

మూతపడిన సాగర్.. పులిచింతల గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 19: కృష్ణాబేసీన్‌లో ఎగువ నుండి వర్షాలు, వరద ఉదృతి తగ్గడంతో గత కొన్ని రోజులుగా ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ సోమవారం శాంతించింది. దీంతో నాగార్జున సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుండి వరద ఉదృతి తగ్గిపోవడంతో సాగర్ ప్రాజెక్టు 26క్రస్ట్‌గేట్లను ఎనిమిదవ రోజు సోమవారం సాయంత్రం మూసివేశారు. ఉదయం 26గేట్లతో నీటీ విడుదల చేసిన అధికారులు మధ్యాహ్నం 12గేట్లకు, తదుపరి ఆరుగేట్ల నుండి, సాయంత్రం రెండు గేట్ల నుండి నీటి విడుదల కొనసాగించి చివరకు ఆరుగంటల సమయంలో రెండు గేట్లను కూడా మూసివేశారు. నాగార్జున సాగర్ నుండి పులిచింతల ప్రాజెక్టుకు నీటి విడుదల నిలిపివేయడంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లను కూడా పూర్తిగా మూసివేసి దిగువకు నీటి విడుదల నిలిపివేశారు. సాగర్ ప్రాజెక్టు గేట్ల నుండి కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు ఎనిమిది రోజుల నుండి కొనసాగిన సందర్శకుల రద్ధీ సోమవారం సాయంత్రంకల్లా తగ్గిపోయింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, 312టీఎంసీలకుగాను సోమవారం రాత్రికల్లా 586.90అడుగులు, 304.98 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 2లక్షల 15వేల 600క్యూసెక్కులుగా ఉండగా, ప్రాజెక్టు గేట్లు మూసీవేయడంతో కుడి, ఎడమకాలువ, పవర్ హౌజ్‌ల ద్వారా అవుట్ ఫ్లో 70,403క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175అడుగులు, 45.77టీఎంసీలకుగాను 169.79అడుగులు, 36.78టీఎంసీలుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల మూసివేసినప్పటికి పవర్ హౌజ్ ద్వారా, టెయిల్ పాండ్ నుండి లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పులిచింతలకు చేరుతుంది. పులిచింతల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు మూసివేసి దిగువకు నీటి విడుదల నిలిపివేశారు. పవర్ హౌజ్ నుండి ఎనిమిదివేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి రెండుగేట్ల ద్వారా సాగర్‌కు రెండున్నర లక్షల మేరకు ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, ఎగువ నుండి వచ్చే వరద నీటిని అనుసరించి సాగర్ జలాశయం నీటి మట్టం హెచ్చుతగ్గుల నిర్వాహణలో మార్పులు కొనసాగనున్నాయి.
చిత్రం...సోమవారం సాయంత్రం మూసివేసిన నాగార్జున సాగర్ క్రస్ట్‌గేట్లు