రాష్ట్రీయం

‘ప్రత్యామ్నాయం’తోనే భూ వివాదాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులను అనుసరించడం ద్వారానే భూ వివాదాలకు తెరదించవచ్చని ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్స్ రిసొల్యూషన్ ప్రాంతీయ కేంద్రం కార్యదర్శి జేఎల్‌ఎన్ మూర్తి పేర్కొన్నారు. మిషన్ భగీరథ ఇంజనీర్లకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్ధతులు, ఇటీవల వచ్చిన సవరణలపై రెండు రోజుల పాటు నిర్వహించే వర్కుషాప్ సోమవారం నాడు ప్రారంభమైంది. మిషన్ భగీరథ విభాగం ఎన్‌ఆర్‌టీజీ భవనం ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫీసులో నిర్వహించిన ఈ వర్కుషాప్‌కు మిషన్ భగీరథ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ జీ కృపాకర్‌రెడ్డి గౌరవ అతిథిగా , చీఫ్ ఇంజనీర్ ప్లానింగ్ , నీటి పారిశుద్ధ్య మిషన్ డైరెక్టర్ వినోబాదేవి మరో అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఎల్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ న్యాయ నిర్ణయంలో చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా వివాదకర్తల్లో అసహనం, అసంతృప్తి కలగడంతో వారు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడం జరుగుతోందని, న్యాయం సకాలంలో సముచితంగా జరగాలని అన్నారు. ప్రభుత్వం వివాదాల పరిష్కారానికి ఏడీఆర్ పద్ధతులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చట్టంలో ప్రధానాంశాలను వివరించారు. కోర్టుల ద్వారా మధ్యవర్తి నియామకంపై కాలపరిమితి నిర్ణయించారని, అవార్డు ఇవ్వడానికైనా ఆర్బిట్రల్ ట్రిబ్యునల్స్‌కు సైతం కాలపరిమితిని నేడు నిర్ణయించారని, దీనివల్ల వేగంగా మధ్యవర్తిత్వం సాధ్యమని అన్నారు. వివాదాల విలువ ఆధారంగా తాత్కాలిక మద్యవర్తులకు ఫీజు అందుతుందని, వాయిదాలు వేసేందుకు కూడా పరిమితులు విధించారని, మద్యకాలీన ఉత్తర్వుల తర్వాత మధ్యవర్తిత్వ కార్య వ్యవహారాలు ప్రారంభించడానికి కూడా నిర్ధారణ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ విధానాలకు లోబడే కోర్టుల జోక్యం వరకూ రాకుండానే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్నజేఎల్‌ఎన్ మూర్తి