రాష్ట్రీయం

వరద నష్టాన్ని లెక్కించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : వరద కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడి అధికారులతో వరద ప్రభావంపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ భారీ వరదలతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చినప్పటికీ, శాంతించింది.. ముంపుప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది.. ఈ నేపథ్యంలో వరద ప్రభావం తగ్గడంతో జరిగిన నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఇప్పటి వరకూ ప్రకాశం బ్యారేజీ ద్వారా 300 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వరదల కారణంగా కృష్ణా జిల్లాలో 33 గ్రామాలు ముంపునకు గురైయ్యాయని, 4300 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయని తెలిపారు. వరద కారణంగా 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నాయని తెలిపారు.