రాష్ట్రీయం

ఆర్టీసీని విలీనం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. త్వరలో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులవుతారన్నారు. ఆర్టీసీ ఆరువేల కోట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలుపుకుంటామన్నారు. రాష్ట్రంలో సమాచారశాఖ, అగ్నిమాపక శాఖ ఈ రెండు మొదటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతునే ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే, మంత్రి నుంచి ప్రతి అధికారికి సమాచార శాఖ అలాగే మంటలు వచ్చినప్పుడు అగ్నిమాపక శాఖ గుర్తుకు వస్తాయని అంటూ చమత్కరించారు. రానున్న ఉగాది నాటికి అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇస్తుందని, ఈ స్థలాల పరిమాణం సామాన్య ప్రజలకిచ్చే దాని కంటే రెట్టింపు ఉంటుందని తెలిపారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏపీయుడబ్ల్యుజే నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయం తనకు తెలుసని, ప్రభుత్వపరంగా కేవలం అక్రిడిటేషన్లు, బస్ పాసులతో సరి పెట్టకుండా అన్ని విధాలుగా వారి అభివృద్ధికి సహకరించడమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధానాలను అధ్యయన బృందాలు పరిశీలిస్తున్నాయని, దీనికి సంబంధించి త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో చిన్న పత్రికలకు జీవం పోసే విధంగా ఇకపై సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలిచ్చి ఆదుకుంటామన్నారు. గత
ప్రభుత్వం మిగిల్చిన రూ. 180 కోట్ల బకాయిలను గాడిలో పెట్టడానికి ఈ ఏడాదాంతా కసరత్తు చేస్తున్నామని వివరించారు. సమాచార శాఖ ప్రస్తుతం నిధుల కొరతను ఎదుర్కొంటొందని, రాష్ట్ర ఆర్థిక సమస్య పరిష్కారం కాగానే ప్రతి జిల్లాలో జర్నలిస్టులకు రవాణా సౌకర్యం కల్పంచేందుకు కొత్త వాహనాలను సమకూరుస్తామని ఆయన తెలిపారు. రహదారుల భద్రత కోసం సీఎం జగన్ ప్రతి ఏడాది రూ. 100 కోట్లు నిధులిచ్చేందుకు అంగీకరించారన్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులు గతంలో చెప్పిన విధంగా నవయుగ సంస్థ చేయని పక్షంలో ప్రభుత్వమే నేరుగా పూర్తి చేస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.

చిత్రం...మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని