రాష్ట్రీయం

పాలన పరుగెత్తాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ‘కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టంలో పూర్తి అధికారాలు కట్టబెట్టాం. ఇదే మాదిరి కొత్త రెవెన్యూ చట్టంలోనూ విశేష అధికారాలు అప్పగించబోతున్నాం. ఇక నుంచి పరిపాలనలో మీదే కీలక భూమిక. అంకితభావం, జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి’ అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ల పనితీరుకు 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అద్దం పట్టాలని ఆయన సూచించారు. ప్రగతిభవన్‌లో మంగళవారం కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన, పంచాయతీరాజ్, మున్సిపల్ కొత్త చట్టాల అమలు, 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. మొదటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. మొదటి రోజు ప్రధానంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ, కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల అమలుపైనే చర్చించినట్టు అధికార వర్గాల సమావేశం. రెండోరోజు కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా వచ్చిన ఎన్నికల వల్ల, కోడ్ అమలులో ఉండటం వల్ల చాలా పరిపాలన స్థంభించిందని, ఇక ఒక్క మున్సిపల్ ఎన్నికలు తప్ప మరే ఎన్నికలు లేకపోవడంతో పాలనను పట్టాలు ఎక్కించి పరుగెత్తించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. గ్రామ, పట్టణాభివృద్ధి వచ్చే రెండు నెలల్లో కళ్లకు కనిపించేలా సాగాలని ఆయన ఆదేశించారు. పరిశుభ్రత, పచ్చదనం, అభివృద్థి, సంక్షేమం నాలుగింటిని సమపాళ్లతో ముందుకు తీసుకెళ్లాలని
సీఎం ఉద్భోదించారు. అవినీతికి ఎక్కడా తావు లేకుండా, పారదర్శకంగా పాలన సాగాలన్నారు. పాత చట్టాల్లోని లొసుగులు అవినీతికి ఆస్కారం ఇచ్చాయని, లంచం ఇవ్వనిదే పని జరగదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని, భూ ప్రక్షాళన సందర్భంగా జరిగిన అవినీతిపై ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, ఇంకా పడుతూనే ఉన్నారని, ఇక నుంచి అలా జరగడానికి ఆస్కారం లేదని, కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని, జిల్లాల విస్తీర్ణం బాగా తగ్గడంతో పర్యవేక్షణకు మరింత సులభతరంగా మారిందని, ప్రతీ శాఖపై, ప్రతిరంగంపై కలెక్టర్లు దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను సత్వరం పరిష్కరించడానికి కృషి చేయాలని సీఎం కోరారు. ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటూ వారిని భాగస్వాములను చేస్తూ సుపరిపాలనను అందించడానికి, అవినీతిని పారదోలడంలో కలెక్టర్లపై గురుతర భాధ్యత ఉందని సీఎం దిశా నిర్దేశం చేసినట్టు అధికార వర్గాల సమాచారం.
నేడు కలక్టర్లతో కలిసి
సీఎం సిద్దిపేట పర్యటన
రెండో రోజు బుధవారం కలక్టర్లతో సమావేశం ముగిశాక వారితో కలిసి సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నట్టు తెలిసింది. గజ్వేల్ నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమాన్ని కలక్టర్లతో కలిసి సీఎం పరిశీలించనున్నట్టు సమాచారం.
చిత్రం...ప్రగతి భవన్‌లో మంగళవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్