రాష్ట్రీయం

అహోబిలంలో కనువిందు చేస్తున్న జలపాతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, ఆగస్టు 20: కర్నూలు జిల్లా అహోబిలంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లమల అడవుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కిందికి దుముకుతూ భక్తులను ఆహ్లాదంలో ముంచెత్తుతున్నాయి.
నవనారసింహాలయాలకు కాలినడకన వెళ్తుంటే అడుగగుగునా సవ్వడి చేస్తూ జలజలపారే జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎగువ అహోబిలంలో వెలసిన వరాహనరసింహస్వామి ఆలయం, జ్వాలానరసింహస్వామి ఆలయ సమీపంలో జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.

చిత్రం... నల్లమల అడవుల్లో జలపాతం హొయలు