రాష్ట్రీయం

ఇక ఆన్‌లైన్ ద్వారానే నిధుల మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 20: గ్రామ పంచాయతీ నిధులను ఇక నుండి పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే విడుదల చేయనున్నారు. ఒక పనిని చేపట్టడం నుండి నిధుల మంజూరు వరకు అన్ని ఆన్‌లైన్ ద్వారానే చేపట్టేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా చెక్కుల రూపంలో నిధులను తీసుకునేవారు. దీంతో అనేక అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అనేక మంది సర్పంచ్‌లతో పాటు గ్రామ స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి ఉన్నది. ఇక నుండి డిజిటల్ కీ ద్వారా నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సంతకాలను సేకరించింది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబందించి మీ సేవా కేంద్రాలు, ఇతరత్రా ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఈ పంచాయతీ సాఫ్ట్‌వేర్‌ను పంచాయతీ కార్యదర్శులు వారి కంప్యూటర్‌ల్లో అప్‌లోడ్ చేసుకున్నారు. ఆయా పంచాయతీలలో పని వివరాలను పొందుపర్చటంతో పాటు తీర్మానం కాపీ స్కానింగ్ చేసి పని విలువ మొత్తాన్ని పొందుపర్చి ఎంబి రికార్డు నెంబర్‌ను కూడా ఆ ప్రోఫార్మాలో అందించాలి. అప్లికేషన్ పూర్తి అయిన వెంటనే సబ్మిట్ చేస్తే సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటకు వస్తుంది. దానిని కార్యదర్శుల ద్వారా ఎస్టీవోలకు సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ నుండి నిధులు నేరుగా పనిచేసిన వారి ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు తీర్మానం లేకుండానే, అసలు పనులు చేయకుండానే చేసినట్లు నిధులు దుర్వినియోగం చేసే వారని, అందుకోసం పాత విధానానికి స్వస్తిపలికి కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తొంది.