రాష్ట్రీయం

అసత్య ప్రచారం ఆపండి: పరిశ్రమల శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంటూ కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. ఆసియా పల్ప్ అండ్ పేపరు సంస్థ రాష్ట్రాన్ని వీడుతున్నట్లు తప్పుడు ప్రచారంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రజత్ భార్గవ్ స్పందించారు. ఇటువంటి ప్రచారాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దురుద్దేశ్యంతో చేస్తున్న విష ప్రచారాన్ని ప్రభుత్వం గమనిస్తోందని, అవినీతి రహితంగా, పారదర్శకతో తమ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు.