రాష్ట్రీయం

వేడెక్కుతున్న ‘రాజధాని’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప : రాజధాని తరలింపు వ్యవహారంపై రాయలసీమలో చర్చ మొదలైంది. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అమరావతి నుంచి రాజధాని తరలింపు తధ్యమన్న సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అమరావతి పట్ల తొలినుండి నిరాసక్తత కనబరిచినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సీఎం జగన్ రాజధాని తరలింపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. దాని పర్యవసానంగానే వైకాపా మంత్రు లు రాజధానిపై బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రాయలసీమలో మళ్లీ రాజధానిపై చర్చలు ఊపందుకుని వేడి పుట్టిస్తున్నాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుండి రాయలసీమలో అసంతృప్తి తలెత్తింది. మద్రాసు నుండి విడిపోయి తెలుగువారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 1953లో శ్రీ్భగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా ప్రకటించారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత 1953 నాటి ఆంధ్ర రాష్టమ్రే ఏర్పడినందున తిరిగి రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని ఇక్కడ ఉద్యమాలు జరిగాయి. రాజధాని ఏర్పాటుకోసం కేంద్రం శివరామకృష్ణ కమిటీని నియమించింది. శివరామకృష్ణ కమిటీ సైతం అమరావతి ప్రాంతాన్ని రాజధానికి అనర్హంగా తేల్చింది. రాజధానిని విజయవాడ ప్రాం తంలో ఏర్పాటుచేస్తే రాయలసీమలో వేర్పాటు ధోరణులు ప్రబలుతాయని కూడా చెప్పింది. అన్ని ప్రాంతాలకు మధ్యేమార్గంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతాన్ని సూచించింది. ఇక్కడ ప్రభుత్వ భూములు 55 వేల ఎకరాలు ఉన్నందున, భూ సేకరణ భారం ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పింది. అయితే చంద్రబాబునాయుడు ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దీంతో శివరామకృష్ణ కమిటీ చెప్పినట్లుగానే, అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుండి రాయలసీమలో వేర్పాటు భావనలు తలెత్తాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆభావనలు ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నా మరో 15-20 యేళ్లకు రాయలసీమ వేర్పాటు ఉద్యమం బలపడి రాయలసీమ విడిపోయే పరిస్థితి రావడం ఖాయమని రాయలసీమ ఉద్యమనాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు. రాజధాని అంశంపై రాయలసీమ ఉద్యమనేత ఒకరు మాట్లాడుతూ రాజధానిని తరలించడానికి సమస్యలేమీలేవన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌కు అంత ధైర్యం ఉందా అన్నదే ఆలోచించాల్సి ఉందన్నారు. శ్రీశైలం జలాశయం నిండినా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వదిలేందుకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రాజధానిని తరలిస్తారని భావించడం సత్యదూరమేనన్నారు. ఏమైనా మరోసారి రాజధాని అంశం రాయలసీమలో చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.