రాష్ట్రీయం

హైదరాబాద్‌కు మరో కీర్తి కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: హైదరాబాద్ నగర సిగలో మరో కీర్తి కిరీటం వెలిసింది. ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ల మీటింగ్‌లో బిజీగా ఉండటంతో హోంమంత్రి మహమూద్ అలీ దీనిని ప్రారంభించారు. ప్రపంచంలో అతి పెద్ద అమెజాన్ క్యాంపస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని హోం మంత్రి ప్రకటించారు. హైదరాబాద్ ఐటీ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరమని , ఈ రంగంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014లో 52వేల కోట్లు ఎగుమతులుంటే అది నేడు లక్ష కోట్లకు పెరిగాయని
అన్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఉద్యోగులు ఐటీ రంగంలో ఉన్నారని పేర్కొన్నారు. అమెరికా వెలుపల నెలకోల్పిన మొట్టమొదటి క్యాంపస్ అదే కావడం హైదరాబాద్‌కు గర్వకారణమని అన్నారు. ఇందులో ఎక్కవ మంది ఉద్యోగులు హైదరాబాద్‌కు చెందిన వారు కావడం విశేషమని అన్నారు. హైదరాబాద్‌లో మూడు అమెజాన్ బిజినెస్ సెంటర్లు ఉన్నాయని, వీటితో 20వేల చిన్న వ్యాపార సంస్థలు పనిచేస్తున్నాయని, హైదరాబాద్ నేడు ప్రపంచంలో అతి పెద్ద ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారిందని అన్నారు. యాపిల్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్,క్వాల్‌కం, ఇంకా ఎన్నో కంపెనీలు హైదరాబాద్‌లో తమ బేస్ కంపెనీలను ప్రారంభించాయని చెప్పారు. టీఎస్‌ఐపాస్ పేరిట పరిశ్రమలకు సరళీకృత విధానాన్ని ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. సరళీకృత వ్యాపారంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, మంచి వాతావరణం, అనుకూల వౌలిక సదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో డాటా సెంటర్ ఆపరేషన్స్‌ను కూడా ప్రారంభించాలని హోం మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఏస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ తదితరులు హాజరయ్యారు.