రాష్ట్రీయం

అధికారాల వికేంద్రీకరణ ఉత్తుత్తి కబుర్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనితీరును నిశితంగా విమర్శించడాన్ని సమర్థిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నేతలు మాటలతో కాకుండా చేతల్లో పోరాట పటిమ చూపించాలన్నారు. బీజేపీ ఇప్పటికైనా టీఆర్‌ఎస్ అవినీతిపై మాట్లాడడం సంతోషమన్నారు. రాష్ట్రంలో వంద కోట్ల రూపాయలకు మించి ప్రాజెక్టులను చేపడితే గ్లోబల్ టెండర్లను పిలవాలన్నారు. మిషన్ భగీరథలో కేసీఆర్ వాటా ఎంతన్నారు. అసలు మిషన్ భగీరథ పుట్టింది కమిషన్ల కోసమన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం ఒప్పుకున్నారన్నారు. అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ చట్టం అంటున్నారన్నారు. ఇప్పటి వరకు అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లేనన్నారు. రెవెన్యూ చట్టాలను సరిచేసి అప్పుడు భూప్రక్షాళన చేయాల్సిందేనన్నారు. తన తప్పును అధికారులపైకి నెట్టవేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. టెండర్ లేకుండా నాలుగు వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం అంటే అవినీతిని ప్రోత్సహించడమవుతుందన్నారు. అవినీతి బయటపడుతుందనే భయంతోనే రాష్ట్రప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రానికి పంపలేదన్నారు. డీపీఆర్‌ను కేంద్రానికి పంపించి ఉంటే రూ.60వేల కోట్ల ఆర్థిక సహాయం రాష్ట్రానికి అంది ఉండేదన్నారు.