రాష్ట్రీయం

దేశ విద్యుత్ ఉత్పత్తిలో ఐదో స్థానంలో సింగరేణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి థర్మల్ కేంద్రం దేవంలో ఐదో స్థానం దక్కించుకుందని సంస్థ సీఎండీ శ్రీ్ధర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ రంగాలకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో సింగరేణి థర్మల్ కేంద్రం విజయవంతం అయ్యిందని ఆయన గుర్తు చేశారు. గత ఏప్రిల్ మాసం నుంచి జూలై నెల వరకూ 91.74 శాతంతో (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) 3,233 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి సాధించిందన్నారు. విద్యుత్ సంస్థ విజయానికి ఉద్యోగులను అభినందించారు. నిరంతర పర్యవేక్షణ విజయానికి కారణమన్నారు. సింగరేణి థర్మల్ కేంద్రం ప్రారంభం నుంచి రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని సాధించిందన్నారు. 2017 ప్రారంభం నుంచి నేటి వరకు 26,266 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పిత్తి చేసిందన్నారు. దేశంలో అత్యధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన థర్మల్ కేంద్రాల ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బుడ్డెబుడ్డె థర్మల్ విద్యుత్ కర్మాగారం మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానం ఒడిశా లోని తాల్చేరు థర్మల్ విద్యుత్ కేంద్రం, మూడవ స్థానం కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్న సాంతాల్ ధిహ్‌థర్మల్ కేంద్రం, నాల్గవ స్థానంలో ససాన్ థర్మల్ విద్యుత్ కేంద్రం మధ్యప్రదేశ్‌లో (రిలయన్స్ సంస్థ) తెలంగాణలో మంచిర్యాల వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి విద్యుత్ థర్మల్ కేంద్రం ఐదవ స్థానం దక్కించుకోవడం పట్ల సీఎండీ శ్రీ్ధర్ అభినందిచారు.
చిత్రం... మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి విద్యుత్ థర్మల్ కేంద్రం