రాష్ట్రీయం

ఆ అధికారం మాకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు చెల్లించేది కేంద్ర ప్రభుత్వమని, అక్కడ ఏం జరుగుతుంతో తెలుసుకునే అధికారం తమకు వుందని జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం తదితర అంశాలపై నివేదిక అందించాలని ప్రాజెక్టు ఆథారిటీని ఆదేశించామని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఆ నివేదిక వస్తుందని ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి రాష్ట్రానికి కార్యనిర్వహక అధికారులు ఉన్నప్పటీ, ఇష్టానసారం చేయడానికి వీల్లేదని మంత్రి తేల్చిచెప్పారు. అక్కడ ఏం జరుతుందో తెలుసుకోనే అధికారం తమకు వుందని అన్నారు. పోలవరం రివర్స్ టెంటరింగ్‌కు సంబంధించి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి ఆశ్సీసులతోనే నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి వద్ద ప్రస్తవించగా సమాఖ్య వ్యవస్థలో ఎవరికీ ఎవరి ఆశీర్వాదాలు ఉండవన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని షెకావత్ చెప్పారు. ఢిల్లీలో నీతి ఆయోగ్‌లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని పోలవరం అంశంపై మాట్లాడాలని తెలుగుమీడియా కోరింది. దీనికి ఆయన ఆన్ రికార్డుగా మాట్లాడేందుకు నిరాకరించారు.