రాష్ట్రీయం

ఇప్పుడేం చేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 24: పోలవరం ప్రాజెక్ట్‌పై రివర్స్ టెండరింగ్ కధ మొదటికొచ్చింది. రీ టెండరింగ్‌తో అంచనా వ్యయం పెరుగుతుందని, పునరావాసం, నష్టపరిహారం భారమవుతుందని, పనులు సకాలంలో జరుగుతున్నాయని క్లీన్‌చిట్ ఇస్తూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పూర్తి స్థాయిలో సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ 2004-05లో ప్రారంభమైందని, 2009లో కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన అనంతరం 2014లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసిందని నివేదికలో గుర్తుచేసింది. అటవీ, పర్యావరణ అనుమతులతో పాటు కోర్టు కేసులను పరిష్కరించి పునరావాస, నష్టపరిహారం అంశాలపై స్పష్టతతో నిర్మాణాలను గత ప్రభుత్వం చేపట్టిందని, నిర్మాణం పురోగతిలో ఉన్న నేపథ్యంలో అర్ధంతరంగా రీ టెండరింగ్‌కు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించటం వల్ల అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని నివేదికలో వివరించింది. ప్రాజెక్ట్ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 2016 సెప్టెంబర్ 30న నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. 2004లో అప్పటి ప్రభుత్వం రెండు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించిందని అయితే 2008, 09 నాటికి నామమాత్రంగా పనులు నిర్వహించటంతో రీ టెండరింగ్‌కు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పనుల్లో జాప్యం కారణంగా డిజైన్లలో కూడా మార్పులు జరిగాయని వరద నీటి నిల్వ సామర్థ్యం కూడా 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షలకు పెంచారని నివేదిక స్పష్టం చేసింది. తరువాత 2012-13లో కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీ పనుల్లో జాప్యం చేయటంతో మరోవిడత ప్రీ
క్లోజర్‌తో రీ టెండర్లు పిలవాల్సి వచ్చిందని పీపీఏ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థ 2018 జూన్ నాటికి స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేసేందుకు అంగీకరించి మరి కొంత వ్యవధి కావాలని పీపీఏకు చేసిన విజ్ఞాపన మేరకు పనులు జరుగుతున్నాయని వివరించింది. గతంలో టెండర్లకు సంబంధించి హైకోర్టులో కేసులు అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వెళ్లిన కారణంగా లేనిపోని తలనొప్పులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. పనుల పురోగతి సంతృప్తికరంగా ఉన్నందున రీ టెండరింగ్ అవసరంలేదని ప్రస్తుతం ఉన్న కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించాలని సూచించింది. రీ టెండరింగ్‌కు కొంత వ్యవధి పడుతుందని, కొత్తగా వచ్చే కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల పురుషోత్తపట్నం, పుష్కర, పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల ప్రశ్నార్థకమవుతుందని స్పష్టం చేసింది. రివర్స్ టెండరింగ్ వల్ల తక్కువ ధరకు కాంట్రాక్ట్ సంస్థలు ముందుకొస్తాయనే గ్యారంటీ లేదని తేల్చి చెప్పింది. పునరావాస కార్యక్రమాలు కూడా ముందుకు సాగవని, రద్దు చేసిన కాంట్రాక్ట్ సంస్థకు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉన్నందున అదనపు భారం పడుతుందని వివరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా పోలవరం రీ టెండరింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటంతో దీనిపై ముందుకెలా సాగాలని రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని శనివారం తాడేపల్లి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ దీనిపై అధికారులతో సమీక్ష జరిపారు. న్యాయ నిపుణులతో సంప్రతింపులు జరపాలనే యోచనలో ఉన్నారు. ఈనెల 17న రివర్స్ టెండరింగ్‌ను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అంతకు ముందు కేంద్ర జలవనరులశాఖ మంత్రితో పాటు కేంద్ర కార్యదర్శులు రీ టెండరింగ్‌పై పునరాలోచన జరపాలని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు లేఖలు రాసిన సంగతి విదితమే. అన్నింటినీ బేఖాతర్ చేస్తూ రీ టెండరింగ్ ప్రారంభించటంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. నిర్మాణ పనుల్లో నాణ్యత, కాలపరిమితి అన్ని అంశాలను నిశతంగా పరిశీలించి మరోసారి నిపుణులతో చర్చించి న్యాయ సలహాలు తీసుకున్న తరువాత ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం.