తెలంగాణ

జైట్లీకి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులు అర్పించింది. శనివారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అరుణ్ జైట్లీ చిత్రపటానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ జైట్లీ లేని లోటు పూడ్చలేనిదన్నారు. పార్టీకి, దేశానికి, న్యాయ వ్యవస్థకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎమర్జన్సీ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో జైట్లీ కీలకపాత్ర పోషించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర పార్టీ, తెంలగాణ ప్రజల తరఫున ప్రతిపక్షనాయకుడిగా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను రాజ్యసభలో , బయట తన గళాన్ని గట్టిగా వినిపించారన్నారు. రాజ్యసభలో పునర్విభజన బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేశారన్నారు. అనేక విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. అరుణ్ జైట్లీ మృతి పట్ల కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మృధు స్వభావి, వారితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. తనకు వ్యక్తిగతంగా అనేక విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చిన నేత అన్నారు. భౌతికం దూరమైనా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారన్నారు. జైట్లీ సూచించిన మార్గాలు భావితరాలకు దిక్సూచి లాంటివన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో అన్ని రకాలుగా సూచనలు, సలహాలు ఇస్తూ రాజ్యసభలో బిల్లును ప ఆస్ కావడానికి విశేషంగా కృషి చేశారన్నారు. జైట్లీ మరణం దేశానికి తీరని లోటన్నారు. సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అరుణ్ జైట్లీ ఎనలేని కృషి చేశారని నివాళులు అర్పించారు. జైట్లీ గొప్ప జాతీయవాది, న్యాయ కోవిదుడు అని ఆయన అన్నారు. జైట్లీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ జీ వివేక్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్‌రావు తదితరులు జైట్లీ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. జైట్లీ దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు.

చిత్రం...హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో అరుణ్ జైట్లీ చిత్రపటానికి నివాళిలర్పిస్తున్న పార్టీ నేతలు