తెలంగాణ

జాతీయ ప్రవేశపరీక్షల షెడ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: జాతీయ ప్రవేశ పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూలును డిసెంబర్‌లో ఖరారు చేయనున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఎంబీఏ ఎగ్జామ్, యూజీసీ నెట్ డిసెంబర్ ఎగ్జామ్, యూజీసీ నెట్ జూన్ -2020 ఎగ్జామ్, సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ ఎగ్జామ్, సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ జూన్ -2020, జేఈఈ మెయిన్ జనవరి 2020, జేఈఈ మెయిన్ ఏప్రిల్ -2020 ఎగ్జామ్, సీమ్యాట్ -2020, గ్రాడ్యూయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్) 2020, ఆల్ ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యూయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2020, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్,
* ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఎంబీఏ, బీఈడీ అడ్మిషన్ టెస్టు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి -2020, జవహర్ లాల్ నెహ్రూ ఎంట్రన్స్ టెస్టు -2020, ఢిల్లీ యూనివర్శిటీ టెస్టు -2020, నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు యూజీ -2020 షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది.
*ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఎంబీఏ అడ్మిషన్ టెస్టు ఈసారి కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది. ఇందుకు సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 25 వరకూ రిజిస్ట్రేషన్ అవకాశం ఇస్తారు. అడ్మిట్ కార్డులను నవంబర్ 11 నుండి జారీ చేస్తారు. పరీక్ష డిసెంబర్ 1న జరుగుతుంది. ఫలతాలను డిసెంబర్ 11న విడుదల చేస్తారు.
*యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షను డిసెంబర్ 2 నుండి 6 మధ్య నిర్వహిస్తారు. ఇందుకు సెప్టెంబర్ 9నుండి అక్టోబర్ 9 వరకూ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. అడ్మిట్ కార్డులను నవంబర్ 9న జారీ చేస్తారు. ఫలితాలను డిసెంబర్ 31న ప్రకటిస్తారు.
* యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్షను జూన్ 15 నుండి 20 వరకూ నిర్వహిస్తారు. ఇందుకు మార్చి 16 నుండి ఏప్రిల్ 16 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మే 15న అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. ఫలితాలను జూలై 5న విడుదల చేస్తారు.
* సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను డిసెంబర్ 15న నిర్వహిస్తారు. ఇందుకు సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 9 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మిట్ కార్డులను నవంబర్ 9న జారీ చేస్తారు. ఫలితాలను డిసెంబర్ 31న ప్రకటిస్తారు. అదే సీఎస్‌ఐఆర్ జూన్ -2020 పరీక్షను జూన్ 21న నిర్వహిస్తారు. ఇందుకు మార్చి 16 నుండి ఏప్రిల్ 15 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మిట్ కార్డులను మే 15న జారీ చేస్తారు. ఫలితాలను జూలై 5న.
* ఐఐటీల్లో యూజీ అడ్మిషన్లకు జేఈఈ మెయిన్ జనవరి పరీక్షను జనవరి 6 నుండి 11 వరకూ నిర్వహిస్తారు. ఇందుకు సెప్టెంబర్ 2 నుండి 30 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అడ్మిట్ కార్డులను డిసెంబర్ 6న జారీ చేస్తారు. ఫలితాలను జనవరి 31న ఇస్తారు. అదే ఏప్రిల్ -2020 రెండో దశ పరీక్షకు ఫిబ్రవరి 7 నుండి మార్చి 7 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మిట్ కార్డులను మార్చి 16న జారీ చేస్తారు. పరీక్ష ఏప్రిల్ 3 నుండి 9 వరకూ జరుగుతుంది. ఏప్రిల్ 30న విడుదల చేస్తారు.
* కామన్ మేనేజిమెంట్ అడ్మిషన్ టెస్టును జనవరి 24న నిర్వహిస్తారు. ఇందుకు నవంబర్ 1 నుండి 30 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మిట్ కార్డులను డిసెంబర్ 24న జారీ చేస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 3న విడుదల చేస్తారు.
* గ్రాడ్యూయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టును జనవరి 24న నిర్వహిస్తారు. ఇందుకు నవంబర్ 1 నుండి 30 వరకూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇస్తారు. అడ్మిట్ కార్డులను డిసెంబర్ 24న జారీ చేస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 3న విడుదల చేస్తారు. ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్టును ఏప్రిల్ 29న నిర్వహిస్తారు. ఇందుకు జనవరి 1 నుండి 31 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 1న ఇస్తారు. ఫలితాలు మే 10న ఇస్తారు.
* నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజిమెంట్ జేఈఈ అడ్మిషన్ టెస్టును ఏప్రిల్ 25న నిర్వహిస్తారు. ఇందుకు జనవరి 1 నుండి ఫిబ్రవరి 29 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 1న ఇస్తారు. పరీక్ష ఫలితాలను మే 10న ప్రకటిస్తారు.
* ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఎంబీఏ, బిఈడీ అడ్మిషన్ టెస్టును ఏప్రిల్ 29న నిర్వహిస్తారు. ఇందుకు రిజిస్ట్రేషన్ జనవరి 31 నుండి ఫిబ్రవరి 29 వరకూ జరుగుతుంది. ఫలితాలను మే 10న ప్రకటిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి ఐకార్ ఎఐఈఈఏ పరీక్షను జూన్ 1న నిర్వహిస్తారు. ఇందుకు మార్చి 1 నుండి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏప్రిల్ 25న అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. ఫలితాలను జూన్ 15న ప్రకటిస్తారు.
* జేఎన్‌యూ ఎంట్రన్స్ టెస్టును మే 11 నుండి 14 వరకూ నిర్వహిస్తారు. ఇందుకు రిజిస్ట్రేషన్ మార్చి 2 నుండి 31 వరకూ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 21న జారీ చేస్తారు. ఫలితాలను మే 31న ప్రకటిస్తారు. ఢిల్లీ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్టును జూన్ 2 నుండి 9 మధ్య నిర్వహిస్తారు. ఇందుకు మార్చి 2 నుండి 31 వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 30న జారీ చేస్తారు. ఫలితాలను జూన్ 25న విడుదల చేస్తారు. ఇక నీట్ యూజీని మే 3న నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ 4న ఇస్తారు. రిజిస్ట్రేషన్ డిసెంబర్ 2 నుండి 31 వరకూ జరుగుతుంది.