రాష్ట్రీయం

బీసీల్లో చేర్చేందుకు పలు కులాల అభ్యర్థన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: దేశవ్యాప్తంగా పలు అల్పసంఖ్యాక కులాలు బీసీల్లో చేర్చమని డిమాండ్ ఉందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లూరి స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర బీసీ కమిషన్ నిబంధనల మేరకు సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని విశాఖ పర్యటన సందర్భంగా ఆదివారం ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ,ఎస్టీల హక్కుల పరిరక్షణకు ఉన్న విధంగానే బీసీల హక్కుల పరిరక్షణకు బీసీ కమిషన్ ఏర్పాటుచేస్తూ కేంద్రం చట్టం చేసిందన్నారు. దేశంలోని కేరళ, పాండిచ్చేరి సహా అయిదు రాష్ట్రాల్లో మాత్రమే బీసీ కమిషన్లు పనిచేస్తున్నాయని అన్నారు. జాతీయ బీసీ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో బీసీల స్థితిగతులపై ప్రధాన మంత్రికి నివేదిక అందించనున్నట్టు వెల్లడించారు. బీసీ పార్లమెంటరీ కమిటీ, బీసీ కమిషన్ సమావేశమై వాస్తవ పరిస్థితులు చర్చించాయి. ఏపీపీలో దాదాపు 25 చిన్న కులాలు ఓబీసీల్లో చేర్చాలంటూ విజ్ఞప్తి చేశాయన్నారు. బీసీ కమిషన్లు, కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్న వర్గాలు ఏమేరకు అభివృద్ధి సాధించాయో పరిశీలించి కేంద్రానికి నివేదించనున్నట్టు తెలిపారు. బీసీ వర్గాల సమస్యల విషయంలో పలు అంశాలను అధ్యయనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగినా కమిషన్ దృష్టికి తీసుకువస్తే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లూరికు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ గౌరవ స్వాగతం పలికారు.
చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తల్లూరి