రాష్ట్రీయం

బాధితులకు నేరుగా పరిహారం రైతు ఆత్మహత్యలపై హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అందించే నష్టపరిహారాన్ని సంబంధిత రైతు కుటుంబానికి నేరుగా అందే ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. వ్యవసాయ జనచైతన్య సమితి, పాకాల శ్రీహరిరావు, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేసింది. దాదాపు 200 మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వివరాలను పిటీషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు సమర్పించి, వీరెవరికీ ఇంతవరకు పరిహారం అందలేదని తెలిపారు. రైతు కుటుంబాల వివరాల జాబితాను పరిశీలించిన హైకోర్టు నిజమైన రైతు ఆత్మహత్యలను గుర్తించి తక్షణమే వారికి పరిహారం అందేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎస్.శరత్‌కుమార్‌కు తెలిపింది. ప్రస్తుతం ఆత్మహ్యత చేసుకున్నవారి వివరాల పరిశీలన జరుగుతోందని, కొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో కోర్టు ఈ కేసును జూన్ 20వ తేదీకి వాయిదా వేసింది.