రాష్ట్రీయం

హిందూ దేశంగా మార్చేందుకు మోదీ అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ తప్పుతడు విధానాల కారణంగా ఇంతవరకూ ద్వైపాక్షిక అంశంగా ఉన్న కశ్మీర్ అంతర్జాతీయ సమస్యగా మారిపోయిందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు అడుగులు వేస్తోందని అన్నారు.
అందులో భాగంగానే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తికల్పించే 370 రద్దు చేసిందని, తమ సిద్ధాంతమైన అఖండ భారత్ కోసమే అని చెబుతున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్‌గుప్త శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్టికల్ -370 రద్దు కశ్మీర్ పరిణామాలు అనే అంశంపై సీపీఐ ఏర్పిటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డీ రాజా కశ్మీర్ చరిత్ర, తాజా పరిణామాలు, పర్యావసనాలుపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కశ్మీర్ ప్రశాంతంగా ఉందని మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని అన్నారు. కశ్మీర్ గురించి కేంద్ర ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని , ప్రజలు మాత్రం తమ కష్టాలు చెబుతున్నారని అన్నారు. ఒక పక్క కశ్మీర్ ద్వైపాక్షిక అంశంమని చెబుతునే మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోనూ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌లతో కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారని , ఇదపుడు ఈ రెండు దేశాలు ఎక్కువగా కశ్మీర్ గురించే మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు అవాస్తవాలు చెబుతున్నాయని , జమ్ముకశ్మీర్ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మోదీ ప్రభుత్వం ఆఘమేఘాల మీద జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును ఆమోదించిందని ఆరోపించారు. అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 370 స్ఫూర్తిని మంటగలిపారని అన్నారు. అంబేద్కర్ హిందూ రాజ్యాన్ని సమర్ధించలేదని, అది వైపరీత్యమే అవుతుందని అన్నారు.
స్వతంత్ర సమరంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ?
స్వాతంత్య్ర సంగ్రామంలో ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్, హిందూ మహాసభలు పాల్గొనలేదని రాజా అన్నారు. బ్రిటిష్, ఫ్రెంచి, పోర్చుగీస్‌పై స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదేనని అన్నారు. హైదరాబాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన వివరించారు. ప్రధానకార్యదర్శిగా ఎన్నిక కావడంలో జరిగిన ప్రక్రియను వివరించారు.
పార్టీ కార్యాలయానికి వచ్చినపుడు డీ రాజాకు సీపీఐ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నేతలు పోటీ పడీ మరీ డీ రాజాను సత్కరించారు.
ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘటనలకు పాల్పడుతోందని ప్రజాస్వామ్యాన్ని పాతర వేసిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? అధ్యక్ష తరహాదపాలన వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మోదీ సర్కార్ ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు.
కార్యక్రమంలో కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరాలు, కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్, పశ్యపద్మ, టీ శ్రీనివాసరావు, బాల మల్లేశ్, ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్‌బోస్, ఐప్సో జాతీయ అధ్యక్షుడు కే యాదవరెడ్డి, నగర ప్రధానకార్యదర్శి డాక్టర్ సుధాకర్, సమన్వయ కార్యదర్శి కేవీఎల్, డీహెచ్‌పీఎస్ గౌరవాధ్యక్షుడు గుండ మల్లేశ్, అధ్యక్షుడు యేసురత్నం, ప్రధానకార్యదర్శి నర్ర శ్రావణ్, ఎఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు స్టాలిన్, ప్రధానకార్యదర్శి శివరామకృష్ణ, ఎఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ తదితరులు రాజాను సత్కరించారు.

చిత్రం...ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్‌గుప్త శతజయంతి ఉత్సవాల
సందర్భంగా జరిగిన సదస్సులో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా