రాష్ట్రీయం

ఏపీ మండలి డిప్యూటీ చైర్మన్ జేబు కత్తిరింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, సెప్టెంబర్ 5: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో జేబు దొంగలు హస్తలాఘవం ప్రదర్శించారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో సాక్షాత్తూ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జేబులోని రూ.లక్ష నగదు కాజేశారు. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి హాజరవ్వడానికి ఉదయం రోడ్డు మార్గంలో చంద్రబాబు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వైపు నుంచి జాతీయ రహదారిపై రావులపాలెం కళావెంకట్రావు సెంటర్‌కు చేరుకున్న ఆయనకు పార్టీ జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాక కోసం ఉదయం నుంచి పార్టీ నాయకులు స్థానిక కళావెంకట్రావు సెంటర్‌లో వేచివున్నారు. సుమారు 9.30 గంటల సమయంలో చంద్రబాబు రావులపాలెం సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో ఆయనతో కరచాలనం చేసేందుకు ఫొటోలు దిగేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ సమయంలో సందట్లో సడేమియా అన్నట్టుగా జేబు దొంగలు తమ పని చక్కబెట్టుకున్నారు. కేబినెట్ హోదాలో ఉన్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆయన ప్యాంటు జేబులో ఉన్న రూ.లక్ష నగదును (రూ.2000 నోట్లు) దొంగలు తస్కరించారు. చంద్రబాబు వెళ్లాక ఈ విషయం వెలుగుచూసింది. నిత్యం ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటవుండే డిప్యూటీ ఛైర్మన్ జేబునే కత్తిరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దీనిపై రావులపాలెం సీఐ వి కృష్ణను వివరణ కోరగా, గురువారం సాయంత్రం వరకు లిఖిత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.
చిత్రం...కిక్కిరిసిన జనం నడుమ చంద్రబాబుకు స్వాగతం చెబుతున్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం