రాష్ట్రీయం

ముంబయి వెళ్లే రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు ఉన్న ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళే ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారిమళ్లించారు. పరిస్థితి చక్కబడేవరకు రైళ్లను పునురుద్ధరించలేమని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు 19 రైళ్లపై రద్దు ప్రభావం చూపుతోంది. సికింద్రాబాద్ - ముంబయి -సికింద్రాబాద్ ( 17057 -17058 ) మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. పూణే, డోన్‌డ్, మన్మాడా మీదుగా కొన్ని రైళ్లను దారిమళ్లించారు. విశాఖపట్నం, కాకినాడ, భువనేశ్వర్, హైదరాబాద్, కన్యాకుమారి, చెన్నై, బెంగళూరు నుంచి బయలుదేరే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. నాందేడ్ నుంచి ముంబయి వెళ్ళే రైలును దారిమళ్లించారు.