రాష్ట్రీయం

శేష వాహనంపై వినాయకుడు విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 6: శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శేష వాహనంపై గణనాథుడు విహరించారు. కార్యక్రమానికి కాణిపాకం, కాకర్లవారిపల్లి, వడ్రంపల్లి, మిట్టఇండ్లు, కొత్తపల్లి, అడపగుండ్లపల్లి, బొమ్మసముద్రం, తిమ్మోజపల్లి, తిరువణంపల్లి, చిగరపల్లిలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం స్వామివారు చిన్న శేష వాహనంపై కాణిపాకం మాడవీధుల్లో విహరించారు. అనంతరం రాత్రి సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి వారికి ఉభయదారులు ఉభయ వరుస తీసుకురాగా ఆలయ అలంకార మండపంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారిని శేష వాహనంపై ఆశీనులను చేశారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన గణనాథుడిని శేష వాహనంపై వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో దేముళ్లు, ఏసీ కస్తూరి, ఏఈవో రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.
విఘ్నేశ్వరునికి శతకలశ క్షీరాభిషేకం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శేష వాహన సేవ జరిగింది. అందులో భాగంగా ఆలయ అలంకార మండపంలో శేష వాహన సేవకు సంబంధించిన ఉభయదారులు ఉత్సవమూర్తులకు సాంప్రదాయబద్ధంగా అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షీర కలశాలను ఉభయదారులు కాణిపాకం వీధుల్లో ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అలంకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఉభయదారుల సమేతంగా వినాయక ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో దేముళ్లు, ఏసీ కస్తూరి, ఏఈవోలు రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.