రాష్ట్రీయం

తిరుమలలో నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 7: తిరుమలలో వసతి, దర్శనం టిక్కెట్ల కేటాయింపు కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటుచేసి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ఆంధ్రా బ్యాంకు కౌంటర్‌లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయానికి సంబంధించి 2 శాతానికి పైగా ఉన్న స్వైపింగ్ చార్జీలను ఈనెల 6వ తేదీ నుంచి రద్దు చేసినట్లు తెలిపారు. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణకు రసాయన ఉత్పత్తులకు బదులు పర్యావరణ సన్నిహిత ఉత్పత్తులను వినియోగించాలని చెప్పారు. ఎస్వీ మ్యూజియం అభివృద్ధిలో భాగంగా 3డి ఇమేజింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. వెబ్‌సైట్‌లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, భక్తులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. గోవింద మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలన్నారు. భక్తులను అయోమయానికి గురిచేసే నకిలీ వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా అధికారులకు సూచించారు. కన్యాకుమారిలో శ్రీవారి ఆలయంలో పలు రకాల మొక్కల పెంపకం ద్వారా సుందరంగా తీర్చిదిద్దాలని, తిరుమల ఘాట్‌రోడ్డులో ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలను పెంచాలని చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఎవి ధర్మారెడ్డి, జేఈఓ పి.బసంత్‌కుమార్, సీవీఎస్వో గోపీనాథ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రామచంద్రారెడ్డి, ఎస్‌ఈ రమేష్‌రెడ్డి, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, డిఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు, డిప్యూటీ ఈఓ సుధారాణి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్‌ఆర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం...అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్