రాష్ట్రీయం

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఆదివారం ఉదయం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ లాన్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికనుండి ఉదయం 11 గంటలకు పదవీ ప్రమాణం చేశారు. 11 గంటలకు ఒక నిమిషం ముందు తమిళిసై వేదికపైకి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వేదికపై ఆసీనులయ్యారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు జాతీయ గీతంలో కార్యక్రమం ప్రారంభమైంది. తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ రాష్టప్రతి జారీ చేసిన ‘వారంట్ ఆఫ్ అపాయింట్‌మెంట్’ ఆర్డర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి చదివి వినిపించారు. వారెంట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇటీవలే జారీ చేసింది. వారెంట్ ఆఫ్ అపాయింట్‌మెంట్‌ను జోషి చదివి వినిపించిన తర్వాత తెలంగాణ హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ మైక్ వద్దకు వచ్చి తమిళిసై సౌందర్‌రాజన్ చేత ఇంగ్లీషులో ప్రమాణం చేయించారు.
ప్రమాణ పత్రం సారాంశం ఇలా ఉంది. ‘డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ అనే నేను భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ, తెలంగాణ గవర్నర్‌గా నమ్మకంతో వినమ్రతతో పనిచేస్తానని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, చట్టాలను అమలుచేయడంలో నా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తానని, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సేవలో నిమగ్నమై ఉంటానని ప్రమాణం చేస్తున్నా’ను అంటూ ముగించారు.
ప్రమాణం చేసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తమిళిసైకి పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ప్రమాణ స్వీకారం మూడు నిమిషాల్లో ముగిసినప్పటికీ ప్రధాన కార్యక్రమం మొత్తం ఎనిమిది నిమిషాల్లో పూర్తయింది.

చిత్రం...తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న తమిళిసై సౌందరరాజన్